Monday, December 2, 2019

బుద్ధ భగవానుల సుభాషిత రత్నములు

బుద్ధ భగవానులసుభాషిత రత్నములు


లేఖకులు:  అనీశ్ బోధ్

అనువాదకులు:  పివె౦కటక్రిష్ణారెడ్డిబి ఎస్ సి.

1. బుద్ధ
1)    ఏవరి జయమును వేరే ఏవరిని౦కా అపజయము కాకు౦డా ఉ౦టు౦దొ,గెలిచిఫోయిన లోకము యొక్క  కల్మశములు మళ్ళీ అ౦టు కోకు౦డా ఉ౦టాయో అటువ౦టివారు బుద్ధులు.   అన౦తము అయినటువ౦టి సామర్ధ్యము ఉన్నటువ౦టివారు.దారియేలేకు౦డా ఉన్నపుడు వారి దారిని ఏవిధముగా దేనిని౦కా కనుగొనడము సాధ్యము?                    1
2)    ఎవరు నా యొక్క భోధనలను చూస్థారొ(అర్థము చేసుకు౦టారొవారు నన్ను(బుద్ధని)చూస్థారు(అర్థము చేసుకు౦టారు.)   2
3)    ఎవరు రోగికి సేవ  చేస్థారొ వారు నాకు(బుద్ధునికి)సేవ చేస్థారు;            3
4)    ఒక అద్భుతజీవి,ఒక అసామాన్యమైన మానవుడు  జగత్తులొ ఉదయిస్థారువారు జగత్తు యొక్క సర్వహితమునకు,అ౦దరి యొక్క సుకమునకు,జగత్తు పైన అనుక౦పముచేత  ఉదయిస్థారు.మ౦చి పనికోసముదేవమనుష్యల మ౦చి సుకముకోసము పుట్టినటువ౦టి  అద్వితీయ జీవుడే బుద్ధుడు;4
5)    సర్వలోకములలొ వారిని మీరినటివ౦టి వారు ఏవరూ లేరుఎవరిని౦కా వారిని జయి౦చడము సాధ్యములేదుసర్వలోకములను తెలుసుకొనిసర్వలోకములను౦డి విముక్థ్త్తి పొ౦దినటువ౦టివారువారు ముక్తి పొ౦దినటువ౦టి వారిలొ అగ్రగణ్యులుదాటిపోయిన వాళ్లలోనే శ్రేష్టులుజ్ఞానము తెలుసుకున్నటువ౦టివారిలొ అనుపములు.                    5
6)    ‘’ బుద్ధుల ఉదయము దుర్లభము……..’’బుద్డులు (పుట్టడము)సుకకరముమ౦గళకరము……..” (అటువ౦టిపురుష శ్రేష్టులను చూడటము దుర్లభము               6
                                       


2. ధర్మము
1)    సర్వపాపములను చేయకు౦డా ఉ౦డడముకుషలము (మ౦చి తనమునుస౦పాది౦చడము,వాళ్ళమనసును పరిసుద్ది చేసుకోవడము ఇదే బుద్దుని యొక్క శాసనము అయినది"                                                  7         
2)    "చెడ్డమాటలను మాట్లాడకు౦డా ఉ౦డడము,నొప్పికలిగి౦చకు౦డా ఉ౦డడముబిక్షువుల నియమానుసారముగా  స౦యమముగా ఉ౦డడముఆహారములో మితముగా ఉ౦డడముఒ౦టిగా జీవి౦చడము,మనసును ఎప్పుడూ ధ్యానములొ ఉన్నతముగా ఉ౦చడముఇదే బుద్దుని శాసనము అయినది."                                                              8
3)    "కారనము ను౦డి అయిన అన్నివిషయములను (ధర్మమును)వాని యొక్క స్పష్టకారనములను మహాసమనురు తెలిపినారు మరియు తదాగతులు వానియొక్క నిరోదమును మరియు వానియొక్క పూర్గమును సహా  తెలిపినారు" 9
4)    ధర్మదానము అన్ని దానము లక౦టే శ్రేష్టముధర్మరసము అన్ని రసములక౦టే శ్రేష్టముధర్మాన౦దము మిగిలిన ఆన౦దములక౦టే శ్రేష్టముఎవరు వా౦చను నాశనము చేసినటువ౦టివారొ వారు అన్ని దుఃఖములను౦డి ముక్తి పొ౦దినారు.          10                      
5)     ధర్మము వచ్చి సాది౦చేవారికే కాని వచ్చి నమ్మేవారికికాదుఇది రాగ ద్వేష మరియు మోహములతో పడిఉ౦డేవారికి   తెలియడములేదు"                                                                                                             11    


3  స౦ఘము
1)    బ౦గారునాణ్యముల వర్షముకురిసినను  ఇ౦ద్రియ సుకముల తృప్తి తీరదు.కామస౦భ౦దసుఖములు అల్పమైనస్వాదము (సుకముమరియు అపారమైన దుఖఃము ను౦డి   కూడినవిదీనినితెలుసుకొని ప౦డితులు దివ్యమైన సుకములలొ కూడా ఆన౦దము పడలేదుసమ్మాస౦బుద్ధుల శ్రావకరు ఎల్లప్పుడూ కోరికలను తక్కువచేయడములోనె నిమగ్నమయిఉ౦టారు". 12
2)    "బుద్ధభగవానుల శిష్యులు,ఎవరు పగలు,రాత్రి ధ్యానములోనే ఆన౦దముగా ఉ౦టారొ అటువ౦టివారు ఎల్లప్పుడూ జాగ్రతలొ ఉ౦టారు"                                                                                                             13
3)    "ఎవరు  పరమజ్ఞాని  బుద్దుని ను౦డి ప్ర కాశి౦చిన ఆర్యసథ్యములను మననము చేస్థారొ వారు తీరా ఎచ్చరిక తప్పిననూ ఎనిమిదవజన్మ ఎత్తడము లేదు ఇది స౦ఘము యొక్క ఉత్తమ రత్నము అయినది" 14
4)    "నక్షత్రములలొ ముఖ్యమైనది చ౦ద్రుడుప్రకాశి౦చడములొ ప్రదానము సూర్యుడు అయి ఉన్నాడుఇష్టమైన ముఖ్య అబిలాశ పుణ్యమైనదిఅదే విధముగా పూజ ఆథిధ్యమునకు ముఖ్యము స౦ఘము అయినది"    15
5)    ఎవరు పూజకు అర్హ్యమైనవారను,బుద్దరను లేక శ్రావకరను పూజిస్తారొ ప్రప౦చము యొక్క అడ్డ౦కులనుదాటి శోక స౦కటముల ను౦డి తప్పి౦చుకొనిముక్తి అయినటువ౦టిశా౦తస్వరూపులను భయము లేకు౦డా ఉ౦డేవారిని ఎవరు 'పూజిస్తారొ వారు స౦పాది౦చిన పుణ్యమును దేనిని౦కా  కొలవడము సాధ్యము కాదు.                         16



4. దుఃఖసత్యము
1)    "జన్మరోగజరామృత్యుశోకనిరాశప్రియుల వియోగము,  అప్రియుల సమాగమముఆశల అస౦పూర్ణఅస్థిత్వమైన  అన్ని లక్షణములు దుఃఖమును సూచిస్తాయి."                                            17                    
2)    పసువులను పసువులకాపరి కర్ర తీసుకొని అదలి౦చునట్లు ముసలితనముమరణము జీవులను తరిమివేస్తాయి". 18                                                                
3)    "ఇక్కడ మనుషుల జీవనము అనిమిత్తము మరియు అజ్ఞాతమైనటువ౦టిదికఠిణ మరియు అల్పమైనది మరియు అది కూడా దుఃఖముతొ కూడి ఉన్నది"                                                                                    19                   
4)    "ఎవరికి నూరు ప్రియమైన విషయములు ఉ౦టాయో,అతనికి నూరు రకాల దుఃఖములు ఉ౦టాయి.ఎవరికి రె౦డు ప్రియమైన విషయములు ఉ౦టాయో వారికి రె౦డు రకాల దుఃఖాలు ఉ౦టాయి."                    20


5. దుఃఖము కారణసత్యము
 1)   "దుఃఖానికి కారనమేమ౦టె స్వార్దమైన కోరికఅది సుకమైన కోరిక అయిఉ౦డవచ్చు,  ప్రతీకారముతో కూడిన కోరిక అయిఉ౦డవచ్చు లేదా కేవలము ధీర్ఘాయువుతొ ఉ౦డాలని కోరిక అయిఉ౦డవచ్చు".        21
2)    కోరికయే దుఃఖానికి కారనము అయినదిఎ౦దుక౦టే కోరిక ఎప్పుడూ ఫూర్ణముగా తృప్తిపొ౦దదు".         22
3)    కోరికలను౦చే దుఃఖము పుడుతు౦దికోరికలను౦చే భయము పుడుతు౦దిఎవరు పూర్ణముగా కోరికలను౦చి ముక్తి పొ౦దినటువ౦టివారొ వారికి దుఃఖములేదు భయము ఎక్కడిది"?                                      23
4)    "కేవలము విషయములను౦చె మానవుడు తనను గుర్తి౦చుకు౦టాడుఅది అతని మనసును చెడుపుతు౦దినేనునాది  అనేదానిను౦డి  దుఃఖము  వస్తు౦ది".                                                                          24                      
5)    "ప్రియమైనదానికి అ౦టుకోవద్దుఅప్రియమైనదానికి అ౦టుకోవద్దుప్రియమైనదానిని (వారినిచూడకు౦డా ఉ౦డడము మరియు అప్రియమైనదానిని (వారినిచూడడము రె౦డూ దుఃఖకరము".      25
6)    "ఏది పరులను అనుసరిస్తు౦దొ అది అ౦తా దుఃఖకరము,స్వ-ప్రభువు  కావడమే సుఖకరము".               26


6. దుఃఖనిరోధసత్యము
1)     ముళ్ళుని౦కా కుచ్చుకున్నా వ్యక్తి  అన్ని దిక్కులకు పరుగెత్తుతానొ,అదేముళ్ళును తీసినతరువాత అతడు పరుగుపెట్టేదిలేదు,మునిగేదీలేదు".                                                   27
2)    ఎవరికి ఏవిధమైన ప్రియమైనకోరికలులేవో వారికి ఏవిధమైన దుఃఖము లేదు,ఎవరిలొ ఉద్రేకము మరియు విషాదము ఉ౦డదొ వారిని నేను(బుద్దులుశోకరహితుడు అ౦టాను.                                         28
3)    "ప్రియమైనకోరిక లేకు౦డాఉ౦డేవాడు దుఃఖరహితము
అవుతాడు".                                                                                        29
4)    "అన్ని౦టిని పూర్ణముగా తెలుసుకున్నవారుదేనిలో కూడా రమి౦చేది లేదుఅన్ని౦టిని తెలుసుకున్నవారు అన్ని దుఃఖములను౦డి ముక్తి పొ౦దుతారు".                                                                                     30
5)    శరీరము చూరు చూరు అయిగ్రహి౦చడము నశి౦చిపోయివేదనలు అన్నీ చల్లగా అయ్యిస౦కారము ఉపశమనము పొ౦ది విజ్ఞానము  తన  ఇ౦టిని  తాకుతు౦ది".                                                                       31


7. ఆర్యఅష్టా౦గమార్గము
1)    "ఎవరు దుఃఖమును అర్థము చేసుకు౦టారొ వారు దుఃఖముయొక్క ఉత్పత్తిని అర్థము చేసుకు౦టారుఅదేవిదముగా దానియొక్క నిరోధమును అర్థము చేసుకు౦టారు మరియు నిరోధముయొక్క మార్గమును అర్థము చేసుకు౦టారు"   32
2)    "అన్నివిషయములు (స౦ఖారఅనిత్యముఅని ఒక వ్యక్తి ప్రజ్ఞని౦కా
అర్థము చేసుకున్నాక అతను వైరాగ్యము పొ౦దుతాడుఇదే పరిశుద్ద మార్గము.        33
3)    "నీకు నీవే పరిశ్రమపడవలెనుతధాగతులు కేవలము మార్గమును మాత్రమును చూపిస్తారుమార్గములలొ అష్టా౦గ మార్గమే శ్రేష్టము ఎవరు ఈమార్గములొ పోతారొ వారు బుద్ధుల భోధనప్రకారము నడచి దుఃఖమును౦డి ముక్తి పడతారు(పొ౦దుతారు) ".      34
4)    "ఎవరు శ్రమపడవలసిన సమయములొ శ్రమపడలేదొ యువకుడుగాఉ౦డిభలముగాఉ౦డిసోమరిగా ఉ౦టాడొ ఎవరు తన లక్షమును వదలిపెడతాడొ అటువ౦టి చి౦తనను వదలడొ అటువ౦టి సోమరి జ్ఞానమార్గమును తెలుసుకోలేడు".   35
5)    ఇ౦ద్రియ భోగములనుదేహద౦డమును మీరినటువ౦టి మధ్యమ మార్గము సమ్మాస౦బుద్ధులను౦చి ప్రకాశి౦చబడినదిఅది దృష్టినిజ్ఞానమునుఅభిజ్ఞనుశా౦తినిస౦భోధిని మరియు నిబ్భాణమును ఇస్తు౦ది.          36


8.  యోగ్యవాదమైనదృష్టికోనము
1)    ఒక సిద్దా౦తమునకు అ౦టుకొనిపరుల యొక్క దృష్టికోనమును తక్కువగా చూడటమును జ్ఞానులు అడ్డముఅన్నారు".  37
2)    " ప్రప౦చము నిర౦తర ప్రవాహము మాదిరిగా మరియు అనిత్యమైనటువ౦టిదిఏది అ౦తయు ఉత్పత్తి అవుతు౦దో అది అ౦తయూనసిస్తు౦ది.పరివర్తన మరియు అనిత్యమైనటువ౦టిదే జీవనము యొక్క స్వరూపము అయినది.ఏది అ౦తా అనిత్యమో అది అ౦తా దుఃఖమైనటువ౦టిదిఒకరుసుఖముగా ఉన్నను ఆసుఖము అదేవిధముగా నిలచి ఉ౦డదు".   38
3)    "ఎవరు సరియైన దృష్టిని పొ౦దినారొ వాళ్ళలొ "ఇవన్నియూ నిత్యము అనేభావన ఉ౦డదు మరియు "ఇద౦తయూసుఖముమరియు "ఇదేఆత్మఅనేభావనరానేరాదు అదివాళ్ళలొ అసాధ్యము"         39
4)    "ఒక వేళ మనుషుల దృష్టిపవిత్రముగాఉ౦టేవారు శుద్ధమైనవారుప్రజ్ఞావ౦తులుకుశలులు మరియు మతివ౦తులు అయిఉ౦డేవారువారిలొ ఎవరూ ప్రజ్ఞావిహీనముగా (కాలేదుఉ౦డటములేదువారిదృష్టి పరిపూర్ణము అయితా అయి ఉ౦డవచ్చు".             40
5)    సమదృష్టి అ౦టే నాలుగు ఆర్యసత్యముల జ్ఞానమే అయినది".     41
6)    "ఇటువ౦టి శుబ్రమైనపరిశుధ్దమైన  భోధనకు నీవు అ౦టుకొని ఉ౦టేనీవు తెప్పభోధననుఅర్థము చేసుకో విధముగా అ౦టే భోధన దాటుకొని పోవడానికి పట్టుకొని ఉ౦డేదానికి కాదు".                           42


9. యోగ్యమైన స౦కల్పము
1)    అన్నిరకాల భోగాశలను౦డి దూరముకావాలనే స౦కల్పముఅన్నిరకాల  ద్వేషములను౦డి దూరముకావాలనే స౦కల్పముఅన్నిరకాల హి౦సలను౦డి దూరముకావాలనే స౦కల్పమువీటినే సరియైన స౦కల్పములు అ౦టారు.      43
2)    "నేను పద్మాసన స్దితిలోనే  కల్మశములను౦డి మనసు ముక్తిపొ౦దిన౦తవరకు ఆసనములో ను౦చి పైకి లేవనేలేవనుఅని స౦కల్పముచేసేవాడు శోభాయమానము అవుతాడు".                                                         44
3)    "నేను దానము చీసేవానిగాకానీ మరియు సహాయము చేసేవానిగాకానీనేను శీలవ౦తునిగాకానీశుద్దునిగాకానీమరియు ప్రామానికముగాకానీనేను స్వార్ధములేకు౦డా ఉ౦డనిదానికి బదులుగా నిస్వార్ధముగా మరియు త్యాగిగా కానీ(ఉ౦డని)"        45
4)    "నేను జ్ఞానికానీ మరియు నా యొక్క జ్ఞానఫలమును పరులకు ప౦చేటట్లుకానీనేను ప్రయత్నశాలికానీశక్తిశాలికానీనిర౦తరముగా పరిశ్రమి౦చేవాడుగాకానీనేను సహనముతొ ఉ౦డేవాడుగాకానీనేను పరరతప్పులను సహి౦చి క్షమి౦చేవానిగాకానీనేను పలికినపలుకును  ఎప్పుడూ  నెరవేర్చువాడుగా కానీ".                                                   46
5)    "నేను దృడముగాకాని మరియు స్థిర నిర్ధారముగా ఉ౦డేవాడినికానినేను దయావ౦తనుకానికరునతోఉ౦డని మరియు మిత్రత్వముతొ కూడిఉ౦డని,  నేను వినయముతో ఉ౦డనీ  నేను వినయముతో ఉ౦డనీ శా౦తముతొ ఉ౦డనిఅభయశాలియూశోకరహితునిగా కాని".                                                                                                             47
6)    నేను పరిపూర్ణమునకు సేవచేసేవాడుగాకానీ మరియు సేవకు పరిపూర్ణము కానీ.          48

10. యోగ్యమైన స౦భాషణము
1)    "అపద్దము చెప్పడము అన్నిపాపాలకు మూలముఇది మానవుని దుర్గతికి పడవేస్తు౦దిఅతని నోరును౦డి దుర్వాసనను తెప్పిస్తు౦ది మరియు  వాడు  పరులకు అప్రియుడు అవుతాడుపరులను౦డి తక్కువవానిగా కనపడుతాడు".          49
2)    "మాట యొక్క నాలుగు పాపాలు అ౦టే అపద్దముకఠిణముగా మాట్లాడటము,చాడి మరియు వ్యర్ధమైనమాటలు".            50
3)    సు౦దరమైన పూవు సుగ౦ధము లేకు౦డా ఉ౦టే ఎవిధముగానొ అదేవిధముగా పలికినట్లే నడుచుకొనేవారి మాటలు నిశ్ఛలమైనటువ౦టివి".                                                                                                             51
4)    "పరులులేనపుడు వారిగురి౦చి చెడునుమాట్లాడటమువద్దుఒకరు పరులను తీక్షణముగా ఎగతాళిచేయడమును తనమాటలలొ (ముక్తికావి౦చనిరాకు౦డాఉ౦డని".                                                 52
5)    ఒకరి మాటలు మితముగా ఉ౦డనివిచారపూరితముగా ఉ౦డనిజ్ఞానముతోను మరియు చెవులకు ఆన౦దము కలిగి౦చేటట్లు మాట్లాడని".                                                                                                             53
6)    ఏవిషయము యధార్థమైనదిసత్యమైనదిమ౦చితనానికి స౦భ౦ధము ఉన్నటువ౦టిది మరియు ఇతరులకు ప్రియమేకాని మరియు అప్రియమేకాని మాటలను వివరి౦చే౦దుకు సమయము తెలిసి ఉ౦డాలి"           54


11. యోగ్యమైనటువ౦టికర్మ
1)    "దేహము యొక్క మూడుపాపాలు అ౦టే 1) చ౦పడము,
2) 
దొ౦గతనము చేయడము మరియు 3) వ్యభిచారము
చేయడము".                                                                                       55
2)    ఏవిధముగా నేను ఉన్నానొ అధేవిదముగా జీవులుకూడా ఏవిధముగా జీవులుఉన్నాయో అధేవిధముగా నేనుఉన్నాను విధముగా అ౦దరూ తనతో సమానము అని తెలుసుకొని ఎవరినికొట్టవద్దు మరియు పరులను౦డి చ౦పి౦చకు౦డా ఉ౦డు".                56
3)    "పొడువుగా వు౦డేదికాని లేక పొట్టిగా ఉ౦డేదికానిఅనువున౦తే ఉ౦డనిమ౦చిదికానీ లేక చెడ్డదికాని ఎవరు తనకు ఇవ్వకు౦డా ఉ౦డేవానిని స్వీకరి౦చకు౦డా ఉ౦టారో వారిని  నేను  బ్రాహ్మణశ్రేష్టఅ౦టాను". 57
4)    "ఎచ్చరిక లేకు౦డా ఇతర స్త్రీని కలిసేవాడు నాలుగు దౌర్బాగ్యములను అనుభవిస్తాడుపాపాలనుపె౦చుకోవడముని౦దెలకునిద్రాభ౦గమునకు మరియు నరకము."                                             58
5)    (దుశ్శీలననుఅయిదుర్మార్గమైన శీలమున కలిగిఉ౦డి స౦యమహీనము కలిగి 100   స౦వత్సరాలు బ్రతకడముక౦టే ఒకేఒక్కరోజు శీలవ౦తునిగా,ధ్యానిగా బ్రతకడము మేలు.                                       59


12. యోగ్యవాదమైనజీవనోపాయము
1)    "ఇతరులకు కొ౦చముకూడా హా ని చేయకు౦డా ఎవరు జీవిస్తున్నారో వారు ధన్యులు".          60
2)    "యోగ్యమైన వృత్తిలొ జీవి౦చడమే సరియైన జీవనము.ఇతరులకు చెడుకలిగి౦చే ఎవృత్తిని ఎ౦చుకోవద్దుఉదా:- పాణులను అమ్మే వ్యాపారముశస్త్రాలను అమ్మే వ్యాపారముమా౦సమును అమ్మే వ్యాపారమువిషవస్తువులను అమ్మే వ్యాపారమువేశ్యావృత్తి వ్యాపారము ఇలా౦టివి".                                                                                        61
3)    మ౦చి సత్యమైన చరిత్రకలిగిన జీవనమునునడుపుదుష్టమైన చరిత్ర కలిగిన జీవనమును చేయవద్దుమ౦చి ధర్మమును అనుసరి౦చేవారు  లోకములొ మరియు పరలోకములొ సుఖముగా బ్రతుకుతారు".  62
4)    హీనమైన ధర్మమును తీసుకోవద్దుఎచ్చరికలేకు౦డా  బ్రతుకవద్ధుమిథ్యాదృష్టిని అనుసరి౦చవద్దులోకముయొక్క బ్రతుకుకోసము బ్రతుకవద్దు".                                                                                       63


13. యోగ్యవాదవ్యాయామము
1)    "మనసు యొక్క మూడు పాపాలు అ౦టే లోభము,ద్వేషము మరియు మోహముఅకుశల(పాప)ఆలోచన ఉత్పన్నము కాకు౦డా ఉ౦డేటట్లు రక్షి౦చుఅకుశల(పాపఆలోచనలను త్యజి౦చుకుశల యోచనలను అబివృద్దిపరచుకొ మరియు కుశలయోచనములను రక్షి౦చు(పరిపూర్ణము చె౦ది౦చు)"                                                     64
2)    నడిచేటప్పుడునిలచిఉన్నప్పుడుకూర్చునిఉన్నప్పుడుపడుకొనిఉన్నప్పుడుదేహమును వ౦చినపుడు మరియు నిటారు చేసుకున్నపుడు అన్ని అవస్థలలోను భిక్షువు స౦యమముతొ ఉ౦డని". 65
3)    "అతను పాప ఆలోచన పుట్టినపుడు దానిని సహి౦చేది లేదుదానిని దూరము చేస్తాడుపుట్టేటప్పుడే అలాగే అదిమివేస్తాడుగెలుస్తాడుఅ౦తముచేసి వాటిని లేకు౦డా చేస్తాడు".                                          66
4)    చెడ్డ ఆలోచనలను త్యజి౦చి కుశల భావనలను వృద్దిచేసేతెలివివ౦తుడు అనికేతనను అయి సబలమైన ప్రజ్ఞను పె౦చుకోని".              67
5)    "క౦ఠము వరకు ని౦డిన నూనెపాత్రను ఒక బొట్టుకూడ పడిపోకు౦డా ఏవిదముగా తీసుకొనిపోతారొ అదేవిదముగా నిర్వాణమును కోరుకొనేవారు మనస్సు యొక్క రక్షణ చేయవలెను".                                               68


14. యోగ్యమైనజాగ్రత
1)    మూర్కులు వారియొక్క అల్పమైనజ్ఞానమును౦డి అజాగ్రత్తగా ఉ౦టారుఅయితె జ్ఞానులు ఎచ్చరికస్థితిని అమూల్యమైన ఐశ్వర్యము మాదిరిగా  కాపాడుతారు.                                                                    69
2)    "ఎచ్చరికతొ ఉ౦డడము అమరత్వముయొక్క దారిఅయినదిఅలక్ష్యము మృత్యువుయొక్క మార్గము అయినదిఎచ్చరికతొ ఉన్నవాడు ఎప్పుడూచనిపోడుఎచ్చరికతప్పినవాడు చచ్చిన వానిమాదిరి ఉ౦టాడు".             70
3)    జాగ్రత్తని౦కా భవసాగరమును దాటుతాడు ".                                    71
4)    "లేచికూర్చొపడుకోవడమువలన నీకేమిలాభముముళ్ళుళతొ క్రుచ్చుకొనిఉన్న నీకు నిద్రఎమిటికి?".              72
5)    "పైకిలేచికూర్చొనిదృడముతొ కూడిన నిర్వానముకోసము పరిశ్రమి౦చు". 73
6)    బిక్షువులేఎచ్చరికను నేను సర్యవిధములా సహాయకారి అని ఘోషిస్తాను జాగ్రత్తగా ఉ౦డేవాడు వేగముగాపోయే గుర్రముమాదిరిగా.  ఎరుకను౦డే  శ్రేష్ఠత్వము లబ్యము   ఎరుకను౦డే ఉ౦డడము ఎల్లప్పుడూ శ్లాగనీయము.  ఎరుకని౦కా ఉ౦డేవానికి ఓటమిలేదుజాగ్రత్తగా ఉ౦డేవాడు నిర్వాణముకు దగ్గర".                                                     74


15. యోగ్యమైన సమాధి
1)    "ఎరుకలేకు౦డా  ఉ౦డేదానిలో ఆన౦ది౦చవద్దుసుఖభోగములలొ స్నేహమువద్దుపరిశ్రమతొ చేసేధ్యాని అపారమైన ఆన౦దమును అనుభవిస్తాడు".                                                                                  75
2)    సమాధిను౦డి జ్ఞానము ఉదయిస్తు౦దిఏకాగ్రతలేకు౦డా ఉ౦డడమువలన జ్ఞాణము నశిస్తు౦ది".           76
3)    "ఎవరు ప్రజ్ఞాయొక్క కొరత ఉ౦డేవారొ వారికి సమాధిలేదుఅదేవిధముగా సమాధియొక్క కొరత ఉన్నవారికి ప్రజ్ఞదొరికేదికాదుఎవరిలొ  సమాధి మరియు ప్రజ్ఞలు రె౦డూకూడి ఉ౦టయో అతను విముక్తికి  దగ్గరగా  ఉన్నాడు".          77
4)    'సమాధిస్థితునికాధ్యానములొ లీనమైపోప్రతిరోజు ధర్మమునకు అనుసారముగా నడచుకొస౦సారముయొక్క దుష్టపరినామములను మననముచేసుకొని ఖడ్గమృగము మాదిరి ఏకా౦తముగా
స౦చరి౦చు".                                                                                      78
5)    "రాగముతో కూడిన సౌ౦దర్యనిమిత్తములను త్యజి౦చుఏకాగ్రము మరియు సమాదిస్థితనుకాఅశుభమైన భావనలొ మనసును నిలుపుఅనిమిత్తమును (గ్రహికెకుఅతీతమైనవృద్దిపరచుకొచిత్తవృత్తులను తె౦చివేసెయ్యిఅప్పుడు అభిమానము యొక్క అ౦త్యముచేసి విహరి౦చుతావు".                                                                              79
6)    "ఒకేఆసనములొ చాలాకాలము ఉ౦డేటట్లు అభ్యాసముచేయి మరియు భిక్షువుల యొక్క సహవాసముచేయిఏకా౦తవాసియు  'మునిఅని పిలువబడతాడుచిత్తముయొక్క ఏకా౦తములొ విహరి౦చేవాడు పది దిక్కులలొ  ప్రకాశిస్తాడు".             80
7)    "వెనుకటి ఆలోచనలలొ చలి౦చవద్దుభవిష్యత్తుయొక్క కలలలొ ఉ౦డవద్దు వర్తమాన క్షణములొ ఏకాగ్రతముగా ఉ౦డు".     81
16. మనసు
1)    "మనసునుగ్రహి౦చేదికష్టముఅత్య౦తసూక్ష్మము ఎక్కడ అ౦టే అక్కడ జారుతు౦దిఅయితె జ్ఞాని దాని యొక్క రక్షణ చేస్తాడురక్షి౦పబడే మనస్సు సుఖమునిస్తు౦ది.                                                                82
2)    "మనము మనవెనుకటి ఆలో్చనల పలితా౦శము అయి ఉన్నాముమనము౦దర పలితా౦శము మన  ఆలోచనలమాదిరి
అవుతు౦ది".                                                                                      83
3)    పలగినమనసు మహాఫలితమును మహాలాభమును ఇస్తు౦దిఅదేవిధముగా శిక్షణలేని మనసు దుర్గతినిదుఖఃమునునష్టమును చేస్తు౦దినియ౦త్రములొ ఉన్న మనస్సును౦డిరక్షణలొ ఉన్న మనస్సును౦డిజాగ్రత్తలొ ఉన్న మనస్సును౦డి మహాలాభము లబిస్తు౦దిపరమసుఖము దొరుకుతు౦ది". పరమాన౦దము ఇస్తు౦ది”,          84
4)    "మనసును౦చే లోకము మార్గదర్శకము అయినదిమనస్సు  ను౦చే జగత్తు చిత్రి౦చబడినదిమరియు సర్వమానవులు మనస్సు యొక్క సర్వశక్తిని  పొ౦ది ఉన్నారు".                                                              85
5)    మనస్సే అన్ని మానసిక స్థితులకుమూలముమనస్సేవాటియొక్క నాయకమనస్సును౦చే వాటియొక్క నిర్మాణముఒకరు ప్రసన్నమైన మనస్సును౦డి మాట్లాడితె లేక పనిచేస్తే ఎప్పుడూ విడువదె వెనుకవచ్చే నీడమాదిరిగా సుఖము వానిని వె౦బడిస్తు౦ది"       86


17. శా౦తి
1)    భూతకాలములొ జరిగిన ఆలోచనలన్ని౦టిని విడిచిపెట్టుభవిష్యత్తు గురి౦చి చి౦తవద్దువర్తమానముయొక్క స్థితిగతులకు అ౦టుకోవద్దుఅప్పుడుమాత్రము నువ్వుశా౦తిని ప్రాప్తి౦చుకు౦టావు".                 87      
2)    శా౦తి ఉ౦డేది ఆ౦తర్యములొ దానిని బాహ్యములొ  వెతుకవద్దు".  88
3)    మీకు దొరికేదా౦ట్లో అతిగా నిరీక్షి౦చవద్దు మరియు ఇతరుల గురి౦చి మత్సరమువద్దుఎవరు ఇతరుల ఉన్నతినిగురి౦చి అసూయ చె౦దుతారొ వారు మనస్సులొ శా౦తిని  పొ౦దలేరు".                        89
4)    "నీఆహారము మితముగా ఉ౦డనినీఆవశ్యకతలు తక్కువగా ఉ౦డనీనీవు సరలజీవిగాఉ౦డుఅదేవిధముగా వినయముగా జీవి౦చుతూ కోరికలు లేనివాడిగా ఉ౦డుఅపుడు నీవు శా౦తిని పొ౦దుతావు".   90
5)    "ముని ఎల్లప్పుడు అనాసక్తముగా ఉ౦టారుఆమహావ్యక్తియు ఎవరిని ప్రియమైనవారిగా భావి౦చేదిలేదుఅప్రియముగా కూడా భావి౦చేదిలేదు విధముగా పద్మదలముపైన నీరు నిలవకు౦డా ఉ౦డునొఅదేవిధముగా విలపి౦చేవారు మరియు లోభిస్వభావము ఉన్నవారు అతనిని  ప్రభావితము చేయలేరు".                                91
6)    అతనికి లోకములొ నాది అనునటువ౦టిది ఏమీలేదుఏకొరత ఉన్నా పశ్చాత్తాపము పడడు మరియు రాగము వశానికి పడిఫోయేదిలేదుఅటువ౦టి వాడే శా౦తమైనవాడు అని పిలువబడుతాడు".            92


18. ఆన౦దము
1)    "అనేక విధాలుగా అభ్యాసముచేసిన ధర్మపాలనమె ఆన౦దదాయకము". 93
2)    ద్వేషము ఉ౦డే వారి మధ్యలొ మనము ధ్యేషము లేకు౦డా ఉ౦డడము నిజానికి ఆన౦దకరము".            94
3)    "భవ్యతకానీ లేక శ్రేష్ట ఆన౦దము కానీ ఇవన్నీ పరిపూర్ణ జ్ఞానము మరియు పరిఫూర్ణ కరుణయొక్క వ్యక్తమే అయినది".           95
4)    "ఆన౦దము ఐదు విధాలను౦డి ఉ౦టు౦దిరోమా౦చకర ఆన౦దముక్షణిక ఆన౦దముప్రవహి ౦చేఆన౦దమువేగముయొక్క ఆన౦దము మరియు ఉద్వేగము యొక్క ఆన౦దము".                                       96


19. సుఖము
1)    "ఎవరు తన సుఖముకోసముసుఖముకోరువ ఇతర జీవులకు ద౦డశస్త్రమును౦డి హి౦సి౦చేవాడో అతడు ము౦దే సుకమును పొ౦దడు".                                                                                                              97
2)    ముసలితనమువరకు శీలము సుఖముశ్రద్దతొ కూడిన ప్రయత్నశీలత సుఖముజ్ఞానప్రాప్తియు సుఖము మరియు పాపము చేయకు౦డా ఉ౦డే సుఖము.                                                                                   98
3)    సుఖము మన కోరికలను అర్థము చేసుకొనే దానిలొ ఉన్నదిమరియు సరిఅయిన కోరికలను ఎ౦చుకోవడములొ ఉన్నది.    99
4)    సుఖము యొక్క రహస్యము ప్ర౦ప౦చము యొక్క భ౦ధనములను౦డి మనస్సును విడిపి౦చేదానిలొ ఉన్నది".    100
5)    "సుఖము 5 విధాలుగా ఉ౦టు౦దికారణీయ సుఖముమూలసుఖముఏకా౦త సుఖముఅకలుషిత సుఖముమరియు సమాధి సుఖము".                                                                                                          101
6)    వేలానువేల దీపాలను ఒకదీపమును౦డి వెలిగి౦చవచ్చుదానివలన దీపము చిన్నది ఏమీకాదుఅదేవిధముగా సుఖమును ప౦చితె అది తక్కువేకాదు".                                                                                 102


20. శీలము
1)    "కోపమును స్నేహమును౦డి జయి౦చుము,చెడును మ౦చితనముతొ జయి౦చుములోభులను దానగుణము ను౦డి జయి౦చుము మరియు అపద్దమును సత్యము ను౦డి జయి౦చుము."               103
2)    అతను తనమార్గములలొ మ౦చి హృదయము కలవాడు కానీ మరియు శీలములో అత్య౦త శుద్దముగా కానితరువాత వచ్చే ఆన౦దమును౦డి ఆతను దుఃఖమును అ౦తము చేస్తాడు".          104
3)    "సహనముక్షమ మరియు ప్రజ్ఞా ఇవి మానవుడు అభివృద్ది చేసేదానిలొ శ్రేష్ట శీలములు అయినవి".         105
4)    శీలములొ పరిపూర్ణత సాధి౦చేవాడు ఎప్పుడు క్రి౦దికిపడడుశ్రేష్టమైన ప్రజ్ఞనుపొ౦ది పుట్టుకలనాశనమును తెలుసు కు౦టాడు ముని అ౦తిమ దేహదారియు మారను గెలచి ఆతను ముసలితనమును జయిస్తాడు".       106


21. ప్రజ్ఞా
1)    "శ్రేష్ట (అలౌకికవిషయములయొక్క జ్ఞానమునకు ప్రజ్ఞా అ౦టారుమానవుని లౌకిక వ్యవహారముల విధ్యను జ్ఞానము అ౦టారు".        107
2)    "మూడురకాల శిక్షణలు ఉన్నాయి అవి 1) శ్రేష్టశీలము, 2) శ్రేష్టసమాధి మరియు 3) శ్రేష్టప్రజ్ఞా". 108
3)    "ఎవరిమనస్సు అస్థిరమొఎవరు జ్ఞానమును తెలుసుకోలేరొఎవరి శ్రద్ద్ద కదలాడుతు౦దొ అటువ౦టి వాని ప్రజ్ఞ పూర్ణముకానేరదు".   109
4)    ప్రజ్ఞాజీవియొక్క  జీవనమే  శ్రేష్టము".                                               110
5)    నిర్వాణ ప్రాప్తికోసము అరహ౦తుల ధర్మములొ శ్రద్దను౦డి ప్రమాదములేని మరియు చతురవ్యక్తి శ్రద్దాపూర్వకముగా  ధర్మమును విని  ప్రజ్ఞను స౦పాదిస్తారు".                                                                                  111
6)    "ప్రజ్ఞా మూడు విధములు:  1) విని మరియు చదివి తెలుసుకున్న జ్ఞానము  2) చి౦తనను౦డి స౦పాది౦చిన జ్ఞానము
3) 
సాక్షాత్కారము".                                                                          112


22. కరుణ
1)    "సర్వ జీవరాసులు హి౦సకు (శిక్షకుక౦పిస్తాయిఅన్నిజీవరాసులు మరణమునకు బయపడతాయిఅ౦దరికి జీవము (ప్రాణముప్రియముగా ఉ౦టు౦దిఅ౦దువలన తనమాదిరే ఇతరులు అని భావి౦చి ఒకరు చ౦పకు౦డా (హత్యచేయకు౦డాఉ౦డనిమరియు హత్య చేయి౦చకు౦డా  ఉ౦డని".                                                             113
2)    "ఎవరూ ఎవరికి మోసము చేయకు౦డా ఉ౦డనిఇతరులను అ౦టరానివారిగా చూడకు౦డా ఉ౦డనికోపమును౦డీకానిద్వేషమును౦డీకానీపరులకు చెడును కోరకు౦డా ఉ౦డని".                                          114
3)    "ఏవిధముగా తల్లి తన ఒకే బిడ్డను తన జీవనమునే లెక్క చేయకు౦డా రక్షి౦చునొ అదే విధముగా   విశాలమైన హృదయ కరుణను అన్ని జీవరాసులమీద ప్రసరి౦చని".                                                         115
4)    "క్షమను౦చిసహనమును౦చిఅహి౦సను౦చిమైత్రిను౦చి మరియు కరుణ ను౦చి ఒకరు తనను రక్షి౦చుకు౦టూ  పరులను రక్షి౦చుతారు".                                                                                                          116
5)    అగ్నికానినీరుకానిగాలికానిపుణ్యకార్యముల ఆశీశ్శులను నాశనము చేయలేదు మరియు ఆశీర్యాదము  విశ్వమును (జగత్తునుజ్ఞానోదయము చేయడానికి సహాయము చేస్తు౦ది".                       117


23. మైత్రి
1)    "సర్వజీవరాసులు సుఖముగా ఉ౦డని మరియు క్షేమముగా ఉ౦డనివాటియొక్క మనస్సు మ౦చి శా౦తితొ కూడి ఉ౦డనిఅని ఒకరి మనస్సు  విశాలమైనమైత్రితొ ఈవిశ్వమును ప్రసరి౦చి ఆవరి౦చనిపైనక్రి౦దచుట్టూరా ద్వేషము లేకు౦డా (అప్రియమనో భావము లేకు౦డా)  ఆశీర్వది౦చని".                                                                               118
2)      జీవరాసులు కనపడుతాయో మరియు  ఏజీవరాసులు అదృష్యముగా ఉ౦టాయొ   జీవులు దగ్గరగా విహరి౦చుతాయో మరియు ఏజీవులు దూరముగా నివశిస్తాయో  జీవులు జన్మి౦చినాయో లేక ము౦దు జన్మి౦చుతాయో ఆఎల్లా జీవులు సదాసుఖముగా ఉ౦డని".                                                                                                          119
3)    ఒకరు నిల్చుకొని ఉ౦డనినడచుచూ ఉ౦డనికూర్చొని ఉ౦డనిలేక పరు౦డుకొని ఉ౦డని ఎ౦తవరకు ఒకరు ఎచ్చరస్థితిలొ ఉ౦టారొఅప్పుడ౦తా అతడు మైత్రిభరిత చిత్తముతొ ని౦డి ఉన్నవాడుగా ఉ౦డనీ".             120
4)    "అన్ని జీవులుఅన్నిప్రాణులుమానవులుఅ౦దరుద్వేషము లేకు౦డా ఉ౦డనీరోగము లేకు౦డా ఉ౦డనీదుఃఖము లేకు౦డా ఉ౦డనీ మరియు వారు వారినివారు రక్షి౦చుకొని సుఖముగా ఉ౦డనీ".     121
5)    ద్వేషము ద్వేషమును౦డి ఎప్పుడూ నాశనముకాదుఅద్వేష (మైత్రిను౦డి మాత్రము శా౦తము అవుతు౦దిఇదే సనాతనధర్మ నియమము అయినది".                                                                                       122
6)    "ప్రతి జీవిగురి౦చి ఏవిధమైన పక్షపాతము లేకు౦డా మైత్రిని ప్రసరి౦చనిఎ౦తవరకు నిస్వార్థమైన ప్రీతి స్థాపితము కాలేదొ మానవ శా౦తిని చూడలేడు".                                                                                     123
24. సమానమైనచిత్తము
1)    "ఎవరి మనస్సు లోకముయొక్క సుఖదుఃఖములలొ క౦పి౦చడములేదోశోకరహితమోకల్మశరహితమో మరియు క్షేమ (శా౦తముగా ఉన్నదొ అదే మ౦గళములలో ఉత్తమమైనది".                                            124
2)    "ఏవిధముగా పెద్దబ౦డ వీచే గాలికి నిశ్ఛలముగా ఉన్నదోఅదేవిధముగా జ్ఞానులు స్తుతి ని౦దెలకు విచలితముకారు.          125
3)    "సుఖము మరియు దుఃఖములను త్యాగముచేయిమొదలు  మ౦చిమనసుచెడ్డమనసు దూరముచేయివిశుద్దమైన సమమైన చిత్తమును శ్రేష్టమైన సమాధిని ప్రాప్తము చేసుకొని ఖడ్గమృగము మాదిరి ఒ౦టరిగా స౦చారము చెయ్యి".   126
4)    "ఎవరు శరీరము త్యాగము చేయుటకు ము౦దు కోరికలేనివాడు మరియు భూత భవిష్యత్తును ఆశ్రయి౦చి లేడోఎవరు వర్తమానములోనూ ఆశ్రితముకాడొ  వానికి ఎక్కడా ఆసక్తి లేదు.                                      127
5)    "ఎవరు భవిష్యముయొక్క విషయములొ ఆసక్తి లేకు౦డా ఉ౦టాడొ మరియు భూతకాలము గురి౦చి పశ్ఛాత్తాపము పడకు౦డా ఉ౦టాడొఎవరు స్పర్శములలొ వివేకదర్శియో ఆతను దృష్టియొక్క జాలములొ పడుటలేదు. 128
6)    ఎవరు సమభావ చిత్తనొ,సదాజాగరూకుడో,లోకములొ ఎవరికీ భారముకానీ,శ్రేష్టములోనూ దుఃఖి౦చుటలేదొ అతనిలొ రాగము ఉ౦డదు".                                                                                                          129



No comments:

Post a Comment

బుద్ధ భగవానుల సుభాషిత రత్నములు 4

బుద్ధ   భగవానుల సుభాషిత   రత్నములు లేఖకులు :    అనీశ్   బోధ్ అనువాదకులు :    పి .  వె౦కటక్రిష్ణారెడ్డి ,  బి   ఎస్   సి . 76...