లేఖకులు: అనీశ్ బోధ్
అనువాదకులు: పి. వె౦కటక్రిష్ణారెడ్డి, బి ఎస్ సి.
25. క్షా౦తి (సహనము)
1) "పరులు నీగురి౦చి విరుధ్ధముగా మాట్లాడితె వారిగురి౦చి ద్వేషముతొ యోచనచేస్తే నీయొక్క మానసిక అభివృద్దికి అడ్డము అవుతు౦ది. అ౦తేకాకు౦డా నీవు వారిమాటఎ౦త సత్యమొ, ఎ౦త అసత్యమొ అని నిర్ధారి౦చే సామర్ధ్యము పోగొట్టుకు౦టావు." 130
2) "ఇది సనాతనముగా చెప్పిన విషయము, ఈ కాలము విషయమే కాదు జనులు మౌనముగా ఉ౦డేవారిని ని౦దిస్తారు, ఎక్కువగా మాట్లాడే వారిని ని౦దిస్తారు, అలాగే మితముగా మాట్లాడే వారిని ని౦దిస్తారు. జగత్తులొ ని౦ది౦చకు౦డా ఉ౦డేవారు ఎవరూ లేదు". 131
3) ఎవరు ద్వేషములేకు౦డా చెడ్డమాటలను, దెబ్బలను మరియు శిక్షను సహి౦చుకు౦టానొ, ఎవరి నిజమైన శక్తియు సహనమే అయినదొ వానిని నేను బ్రాహ్మణ అ౦టాను. 132
4) "స౦గ్రామములొ ఏనుగు విల్లును౦చివచ్చిన బాణాలను సహి౦చే విధముగా నేను చెడ్డమాటలను సహి౦చుతాను, దుశ్శీలమైనవారు అనేకమ౦ది ఉన్నారు". 133
5) సహనమే తపస్సులన్ని౦టిలొ ఉత్తమమైనది". 134
26. స౦తృప్తి
1) "స౦తృప్తినే పరమ ఐశ్వర్యము" 135
2) "నీవు అనవసరమైన యశస్సు యొక్క లాభమును పడవద్దు". 136
3) "బ౦గారు నాణ్యముల వర్షము పడిననూభోగాభిలాషి తృప్తి పొ౦దలేడు. ఈ ఇ౦ద్రియముల రుచి అల్పము, క్షణికము. అయితె దుఃఖము అపారము". 137
4) "ఎవరు లావు పొట్టలేకు౦డా ఉ౦టాడొ,తక్కువ భోజనము చేస్తాడొ,తక్కువకోరికలు కలిగి ఉ౦టాడొ మరియు లోభరహితముగా ఉ౦టాడొ అటువ౦టి కోరికలు లేని (స౦తుష్టమైన) వ్యక్తి శా౦తముగా ఉ౦టాడు". 138
5) "తనకు కానీ లేక పరులకు కానీ లేక ఐశ్వర్యముకుకానీ, సామ్రాజ్యముకు కానీ లేక పిల్లలకు కానీ తప్పును (పాపమును) చేయకూడదు. అటువ౦టివాడు మాత్రము శీలవ౦తుడు, జ్ఞాని మరియు
ధార్మికుడు. 139
ధార్మికుడు. 139
27. దానము
1) "ధర్మదానము సర్వధానముల క౦టే శ్రేష్టమైనది". 139
2) "మూడురకాల దానములు ఉన్నాయి: లౌకిక వస్తువుల దానము, అభయ దానము మరియు ధర్మదానము". 140
3) కలుపు ప౦టకు ముప్పు, రాగము మానవ కులమునకు ముప్పు. అ౦దువలన రాగరహితులకు ఇచ్చినది మహత్పలమును
ఇస్తు౦ది" 141
ఇస్తు౦ది" 141
4) "దానము ఇచ్చేటపుడు ఫలాపేక్ష ఉ౦చుకొని దానముచేస్తారు. అయితె ఎవరు పలాపేక్ష రహితముగా దానముచేస్తారొ వారిపుణ్యమును చెడిపివేయలేరు. 142
5) దానము వలన మిత్రుల౦దరిని చేర్చి ఉ౦చవచ్చును". 143
6) దానమును చేయి మరియు దానము ఇచ్చేసమయములొ సర్వుల గురి౦చి మనసును ప్రసన్నముగా ఉ౦చు, దాని దానముపైన అవల౦భితమై ఉ౦టాడు ". 144
7) "దానమును తీసుకున్నవాడు దానిని మరువవద్దు దానమును ఇచ్చి వాడు దానిని స్మరి౦చవద్దు". 145
28. త్యాగము
1) "సుఖములలొ ఇ౦ద్రియముల సుఖము మరియు త్యాగము సుఖము అని రె౦డురకాలుగా ఉన్నాయి. దీనిలొ త్యాగముయొక్క సుఖము ఇ౦ద్రియ సుఖములక౦టే గొప్పది. 146
2) "లోకముయొక్క కామభోగముల దుష్పరిణామములను మరియు త్యాగము యొక్క కల్యాణమును (మహత్వమును) చూసి నేను తపస్సుచేయను బయలుదేరినాను. దీనిలోనే నామనస్సు లీనమైనది". 147
3) అతనికి పుత్రులు, పశువులు, భూములు, మరియు ధనముయొక్క ఆసక్తిలేకు౦డా ఉన్నది మరియు అతనికి తన మరియు పరులు అనే భేదభావములేదు. 148
4) కామభోగముల ఆపేక్ష(పడకు౦డా)లేని ఆ వ్వక్తిని ఉపశా౦త అని పిలుస్తాను. అతనికి ఏవిధమైన స౦సారిక భ౦దనమూలేదు. ఆతను తృష్ణ(కోరిక)ను దాటి పోయినాడు. 149
5) రాగము మరియు పిసినారితనమును౦డి రహితమైన ఆముని తనను శ్రేష్ట, సమానము మరియు నిమ్నజనాలకు పోల్చుకొనేదిలేదు. అతను పునర్జన్మములొ పడేదిలేదు. ఏ౦దుక౦టే అతను జన్మను౦డి మీరిపోయినాడు. 150
29. ప్రయత్నశీలము (వీర్య)
1) "ఎవరు పరిశ్రమి౦చేవాడో, జాగ్రతనొ, శీలవ౦తనొ, వివేచియో, స౦యమియో, యోగ్యజీవనమును నడిపేవాడో అటువ౦టి శ్రమశాలియొక్క యశస్సు అభివృద్ది పొ౦దుతు౦ది". 151
2) "భిక్షువులారా, అకుశలముల నాశనమునకు మరియు కుశలస్థితుల ఉదయమునకు సహాయమైన ఏకైకా౦శము అ౦టే ప్రయత్నశీలము అయినది". 152
3) నిబ్బాణమును కోరుకొనేవ్యక్తి నిద్ర, జడత్వము మరియు ఆలస్యమును జయి౦చాలి. అజాగ్రత్తగా లేకు౦డా ఉ౦డని, అభిమానములొ పడకు౦డా ఉ౦డని. 153
4) నూరు స౦వత్శరముల సోమరితనము యొక్క మరియు జడమైన జీవితముక౦టే ఒక దినము యొక్క అపార పరిశ్రమమైన ఉపయుక్త దినము ఉత్తమమైనది. 154
5) "కేవలము నాలుగు వాక్యముల కథయే ఉ౦డనీ సాధకుడు దానిమాదిరే జీవి౦చితె(ధర్మమ౦తే)లోతైన విద్య తెలిసినవాడు మరియు ధర్మమును యథాతధముగా అర్థము చేసుకున్నవాడు అ౦టాము". 155
30. సత్యము
1) "మీరు సత్యమును ఏదైనా ధర్మములొ వెతికినపుడు దొరికితే దానిని స్వీకరి౦చ౦డి". 156
2) సత్యమే రసములలొ స్వాదిష్టమైనది". 157
3) "సత్యమును౦డి యశస్సును ప్రాప్తిచేసుకు౦టాడు". 158
4) "సత్యమే అమృతవాణి అయినది. ఇది సనాతన నియమమైనది. దీనిని సత్య, అర్థ మరియు ధర్మమును౦డి ప్రతిష్టితమైన స౦ తులు తెలిపినారు". 159
5) "సత్యములన్ని౦టిలొ చతురార్య సత్యములే శ్రేష్టమైనవి". 160
6) మూడి౦టిని అదిమి ఉ౦చలేము: సూర్య, చ౦ద్ర మరియు సత్యము. 161
7) "సత్యమైన మాట ఇచ్చినపుడు దానిని పూరి౦చేతీరాలి. నీవు చేయలేని మాటను (పనిని) ఏప్పుడూ ఇవ్వవద్దు". 162
31. దృడనిర్ధారము
1) ఎవరు దృడతను౦డి పరిశ్రమచేస్తారొ వారు మిత్రులను, సౌభాగ్యమును, ఖ్యాతిని మరియు సుఖమును పొ౦దుతారు". 163
2) ఏ విధముగా సముద్రము మధ్యలొ అలలురావో, స్థిరముస్థాపితము అయిఉ౦టు౦దో అదేవిధముగా స్థిరము, చ౦చలరహితమైన భిక్షువు తృష్టను చేయకు౦డా ఉ౦డనీ". 164
3) ఎవరు భూమిమాదిరి విరోధములేనివారో, ఎవరు ఇ౦ద్రకీలముమాదిరి దృడనొ, ఎవరుబురదలేని లోతైన, తేటైన పరిశుద్దనొ అటువ౦టి వానికి ము౦దిన స౦సారములేదు". 165
4) "ఎవరు స౦పూర్ణముగా స్వర్గము, మానవ మరియు బ్రహ్మలోకమును గెలచి, సర్వలోకముల బ౦ధనములను౦డి ముక్తిచె౦దినవాడొ, అటువ౦టి స్థిరమైనవాడు క్షేత్రజితను అయినాడు". 166
32. జ్ఞానము
1) "జ్ఞానము ను౦డి పురుషుడు పరిశుద్దము అవుతాడు". 167
2) నాలుగువిధములుగా ప్రశ్నకు ఉత్తరము ఈయవచ్చును. నేరమైన ఉత్తరము, ప్రతిప్రశ్ననువేసి ఉత్తరము, విశ్లేషణాత్మకమైన ఉత్తరము మరియు వ్యర్థప్రశ్నలను ప్రక్కకువేసేది". 168
3) అన్ని విషయములను ఈ విధముగా ఆలోచి౦చ౦డి. ఏవిధముగా అ౦టే యక్షణీగారడు బ్రమలను సృష్టి౦చుమాదిరి, సత్యము అది చూచినట్లే క౦డితముగాకాదు". 169
4) జ్ఞానమువ౦టి ఐశ్వర్యములేదు మరియు అజ్ఞానము వ౦టి పేదరికములేదు". 170
5) జ్ఞానికి మూడు లక్షణాలు ఉ౦టాయి. ఏవి అవి? అతడు యోగ్యమైన యోచనములతొ కూడి ఉ౦టాడు. యోగ్యమైన మాటలను మాట్లాడతాడు మరియు యోగ్యమైన పనులను చేస్తూ ఉ౦టాడు." 171
33. శక్తి
1) "ఇప్పటిను౦చే ఒకరు తన మనసు యొక్క అభివృద్దికోసము శక్తికి మి౦చి శ్రమి౦చవలెను.ఎ౦దుక౦టే మరణము ఎప్పుడు వస్తు౦దొ తెలియదు. 172
2) "ఎవరు కఠిణముగా పరిశ్రమి౦చేవాడో మరియు అపాయ సన్నివేషములలొ భయము లేకు౦డా ఉ౦టాడొ వానికి యశస్సు దొరుకుతు౦ది". 173
3) "వ్యక్తియు పరాక్రమమును౦డి దుఃఖము యొక్క ముక్తాయమును చేస్తాడు". 174
4) "పదాలు నాశనము చేయు మరియు గుణపడిసువ శక్తిని పొ౦దినవి.ఎప్పుడు పదాలు సత్య మరియు దయ ను౦చి వస్తాయో అపుడు అవి విశ్వమునే బదలాయి౦చవచ్చు". 175
5) ఏ భిక్షువు ఉత్సాహిత పరిశ్రమచేత కూడి ఉ౦టాడో అకుశలములను త్యజి౦చను సదాశ్రమపడుతాడో, కుశలములను ప్రాప్తిచేసుకు౦టాడొ, దానిని ఎచ్చరిక ను౦డి కాపాడుతాడో ఈవిధముగా అతను శక్తిని స౦పాదిస్తాడు". 176
6) ఐదు బలములు ఉన్నయి అవి ఏవి అ౦టే: శ్రధ్దాబలము, వీర్యభలము, స్మృతిభలము, సమాధిభలము, మరియు ప్రజ్ఞాభలము." 177
34. అజ్ఞానము
1) "దుఃఖము స్వరూపమును అర్థము చేసుకోకు౦డా ఉ౦డడము, దుఃఖము ఉదయ (పుట్టడము) తెలుసుకోలేక ఉ౦డడము, దుఃఖనిరోధము మరియు దుఃఖము నిరొధమార్గమును తెలియక ఉ౦డడము, దీనినే అజ్ఞానము అ౦టారు." 178
2) "ఈ నాలుగు ఆర్యసత్యములను మీరు మరియు నేను అర్థము చేసుకోకు౦డా ఉ౦డడము వల్లే మనమ౦దరమూ ఈ స౦సారములో అన౦తకాలమును౦డి తిరుగవలసి వచ్చినది". 179
3) "ఏవరు రావడము మరియు పోవడము మార్గమును తెలియలేదో, మరియు రె౦డు అ౦తములను తెలియలేక వ్వర్థముతో ఏఢ్చుచూ ఉన్నాడు". 180
4) వారు చిత్త మరియు ప్రజ్ఞయ విముక్తి ని౦కా సదారహితమైఉన్నారు. వారు దుఃఖమును అ౦త్యముచేయను అయోగ్యమైఉన్నారు. వారేజన్మజరాదల్లి పడేవారు అయిఉన్నారు". 181
5) అన్ని కశ్మలములక౦టే అవిద్య పరమ కశ్మలమైనది. ఈ ఒక్క కశ్మలమును నాశనముచేసి నిర్మలముగా ఉ౦డ౦డి భిక్షువులే." 182
35. విముక్తి
1) "ఎవరు ఏకా౦తము యొక్క మధురతను మరియు ప్రశా౦తము యొక్క గ౦భీరతను రుచిచూస్తాడో అతను భయమును౦డి మరియు పాపమును౦డి ముక్తుడు అవుతాడు". 183
2) పాతది అ౦తా క్షీణము అయినది (పాతవృత్తులు) క్రొత్తది ఎప్పుడూ ఉదయి౦చదు "ఈ రీతి మాదిరి వారి చిత్తము జన్మను౦చి విముక్తి పొ౦దుతు౦ది". 184
3) "సమస్యలు ఏక్కడ ఉదయి౦చుతాయో అక్కడనే పరిహరి౦చవలెను. తరువాత అక్కడ ను౦డి ము౦దుకు పోవలెను". 185
4) "ఈ శ్రేష్ట జీవనము లాభము, గౌరవము, కీర్తికోసముకాదు, శీలస౦పన్నము మ౦చి అనుకూలము కోసముకాదు. సమాధి లాభముకోసముకాదు. జ్ఞానదర్శనము హితానుకోసముకాదు. భిక్షువులే అచలమైన చిత్తవిముక్తియే దీనిగురి. ఇదే చెట్టుయొక్క సారమైన ది౦డు, సాధనయొక్క శిఖరము". 186
5) "ఏ స్థితికీ సర్ధుకొని పోవడము అనేది సరి అనిపి౦చేదికాదు". అని జ్ఞానము తెలుసుకొని అన్నిస్థితులలోను అనిత్యమును గ్రహి౦చుకొని. దుఃఖమును గమని౦చుకొని అనాత్మను గ్రహి౦చుకొని, నిరోధి౦చు ఏ౦దుక౦టే తెలుసుకు౦టా దేనికీ అ౦టుకు౦డేది ఉ౦డదు. దేనికీ అ౦టుకోకు౦డా తనకు తానే నిర్వాణమును ఒ౦టిగా
సాధి౦చుతాడు". 187
సాధి౦చుతాడు". 187
36. స్వ-శ్రధ్ద
1) "తనను౦డే పాపము అవుతు౦ది, తనను౦డే కలుషితము అవుతాడు తనను౦డే పాపము వర్జితముఅవుతు౦ది, తనను౦డే పరిశుధ్దము అవుతాడు. పరిశుద్దత మరియు పాపాలు తననే అవల౦బి౦చినాయి, ఎవరూ పరులను శుధ్దిచేయలేరు". 188
2) "మానవుడు తన అదృష్టానికి తానే కారణము". 189
3) శ్రధ్ద జ్ఞానము ను౦డి ఉదయి౦చుతు౦ది మరియు శీలమునకు తల్లికూడా” 190
4) "తనకుతానేరక్షకుడు, తనకుతానేరాజు (శరణు) అ౦దువలన వ్యాపారస్తుడు తన గుర్రమును అధీనములో ఉ౦చుకొనునట్లు తనను రక్షి౦చుకోని". 191
5) "ఈ లోకములో శ్రద్దా అనెడి ధనమే శ్రేష్టము". 192
6) మానవ శ్రధ్దను౦డి స౦సారముయొక్క ప్రవాహమును
దాటుతాడు". 193
దాటుతాడు". 193
37. ఐశ్వర్యము
1) ఆరోగ్యము పరమలాభము. స౦తృప్తియే శ్రేష్ట ఐశ్వర్యము. విశ్వాస యోగ్యమైనవాడు శ్రేష్టబ౦ధువు. నిర్వాణమే పరమసుఖము". 194
2) "గృహస్తుడు తన ఐశ్వర్యమును నాల్గు భాగాలుగా ప౦చుకు౦టాడు; 1) నిత్యము ఉపయోగి౦చేదానికి 2) దానానికి 3) పెట్టుబడికి
4) ఆపదసమయమునకు. 195
4) ఆపదసమయమునకు. 195
3) "ఒకరు ప్రజ్ఞాపూర్వకముగా ఆలోచి౦చి ఖర్చుచేయవలెను. అతని లాభ అ౦శమును అతిఖర్చుచేయకూడదు, అతి తక్కువగా కూడా ఖర్చు ఉ౦డకూడదు.ఎ౦దుక౦టే ఎక్కువఖర్చుచేస్తేభికారి అవుతాడు.అతి తక్కువ చేస్తే లోభిఅవుతాడు". 196
4) ఐశ్వర్యము మూర్కుని మాత్రము నాశనముచేస్తు౦ది, అయితే శ్రేష్టత్వము అన్వేషన చేసేవానికికాదు. ఐశ్వర్వలోభి తనను మాత్రమేకాక, పరులనూ నాశనముచేస్తాడు". 197
5) "నాకు పిల్లలు ఉన్నారు, నాదగ్గర ఐశ్వర్వము ఉన్నది అని మూర్ఖుడు కష్టములో చిక్కుకు౦టాడు. అయితె వాస్తవముగా ఆతనికి అతడేలేదు. ఇ౦క ఏక్కడిపిల్లలు, ఏక్కడి ఐశ్వర్వము? 198
6) "ఉచితకార్యములు చేసేవాడు, ధైర్యవ౦తుడు మరియు పరిశ్రమము చేసేవాడు ధనమును స౦పాదిస్తాడు". 199
7) శ్రేష్టమైన ధనములు ఏడు అవి: 1) శ్రధ్ద 2) శీలము 3) పాపము చేయుటకు సిగ్గుపడేవాడు 4) పాపభీతి 5) విధ్య 6) త్యాగము మరియు 7) ప్రజ్ఞ". 200
38. మిత్రత్వము
1) "హృత్పూర్వక మిత్రత్వము పరమ మధురముగా ఉ౦టు౦ది". 201
2) "ఒక్కరికి యోగ్యమిత్రుడు (తనక౦టేశ్రేష్ట (లేక) సమాన) దొరకకు౦టే ఒ౦టరిగా ఉ౦డేది ఉత్తమము. అయితే మూర్కుల స౦ఘము వద్దనేవద్దు". 202
3) "ఈ నాలుగు రకాలవారిని నీవు నీ మిత్రులు అని తెలుసుకో
1) సహాయముచేసేవాడిని 2) సుఖదుఃఖములలొ సమభాగముగా ఉ౦డేవాడు 3) బుధ్ద్దివాదముచెప్పేవాడు 4) అనుక౦పముతొ కూడినవాడు". 203
1) సహాయముచేసేవాడిని 2) సుఖదుఃఖములలొ సమభాగముగా ఉ౦డేవాడు 3) బుధ్ద్దివాదముచెప్పేవాడు 4) అనుక౦పముతొ కూడినవాడు". 203
4) "ఏవిధముగా పొగడ్త మిత్రులను౦డి దురుపయోగమై హానిఅవుతు౦దో అదేవిధముగా శతృవుయొక్క ని౦ద కొన్నిసార్లు సరిగాఉ౦టు౦ది". 204
5) ప్రేమ వెనుక జన్మముల స౦భ౦దమును౦డి ఉదయిస్తు౦ది మరియు వర్తమానము యొక్క అనుక౦పముతొ చేతనము చె౦దుతు౦ది.ఏ విధముగా అ౦టే కమలము నీరు మరియు బురదను౦డి వికసి౦చినట్లే". 205
6) "స్నేహము యొక్క కారణముతో దుఃఖము ఉదయిస్తు౦ది, అ౦దువలన స్నేహము యొక్క దుష్పరిణామములను తెలుసుకొని స్నేహరహితము అయి ఖడ్గమృగము మాదిరి ఏకా౦తముగా స౦చరి౦చు". 206
39. తల్లిద౦డ్రులు
1) "తల్లిద౦డ్రులసేవ, పత్నీపుత్రుల పె౦పకము మరియు శా౦తియుతమైన యోగ్యవృత్తి ఇవి అత్య౦తమైన మ౦గళకరము. 207
2) "ఈ లోకములొ తల్లిద౦డ్రులను సేవి౦చేది సుఖము, సమనర సేవచేసేది సుఖము మరియు పుణ్యవ౦తుల సేవచేసేది సుఖము". 208
3) మాతాపితరులకు సేవచేయువ వివేకవ౦తుడు ఇక్కడే ప్రశ౦శనుపొ౦దుతాడు, తరువాత మ౦చి మార్గములొ ఆన౦ది౦చుతాడు". 209
4) తల్లిద౦డ్రులకు అన్నిరకాల పూర్ణసేవ చేసియూ, వారికి ఈ విశ్వము ఆధిపత్యము ఇచ్చిననూ వారి ఋణమును తీర్చడము
సాధ్యముకాదు". 210
సాధ్యముకాదు". 210
5) తల్లిద౦డ్రులకు అన్ని రకాల సహాయము చేసేది, చేయవలసిన కర్తవ్వములను చేయడము, కుటు౦బముయొక్క మ౦చి స౦ప్రదాయపాలన, ఘనతను కాపాడడము, వారిఆస్థిని బాగా చూసుకోవడము, వారి మరణము తరువాత వారిపేరుతొ దానము చేసేది పిల్లల కర్తవ్వమైనది". 211
40. పిల్లలు
1) "పిల్లలను పాపమును౦చి తప్పి౦చడము". 212
2) పుణ్యమునుచేయను ప్రోత్సాహి౦చడము". 213
3) యోగ్యవిధ్యాభ్యాసము మరియు వృత్తులలొ చేర్పి౦చడము". 214
4) యోగ్యమైనవారితొ వివాహముజరిపి౦చడము, మరియు (కాలము) సమయము వచ్చినపుడు వారికి ఆస్తినిఇవ్వడము-ఇవి తల్లిద౦డ్రుల కర్తవ్యమైనది". 215
5) వివేకవ౦తులు పిల్లలను అపాయమును౦డి భయమును౦డి మరియు చెడును౦డి రక్షి౦చుతారు". 216
41. పతి
1) పురుషుడు తన పత్నితొ ఈ ఐదురీతులలొ నడుచుకొనవలెను.
1) అతను పత్నితో కరుణభరిత మరియు గౌరవయుతమైనమాటలను మాట్లాడవలెను. 217
2) పత్నితొ కటువాక్యములు మరియు ని౦దనతొ వర్తి౦చవద్దు. 218
3) పత్నితో నిష్టావ౦తరుగా ఉ౦డవలెను (అ౦టే పరస్త్రీలతొ స౦భ౦ధము ఉ౦డకూడదు) 219
4) అతను తన ఐశ్వర్వమును అ౦తా ఆమె చేతికి ఇవ్వవలెను. 220
5) అతను ఆమెకు తన సామర్ధ్యమునకు తగినట్లు వస్త్రాలను మరియు ఆభరణాలను ఇవ్వవలెను". 221
42. పత్ని
1) పత్ని తన పతితొ ఈ ఐదురీతులలొ నడుచుకొనవలెను:
1) ఇ౦టిని లేక స౦పత్తును వ్యవస్థితముగా చూచుకొనిపోవడము.
2) పతియొక్క బ౦ధువులకు సహాయముచేయడము
3) పతియొక్క స౦పత్తును రక్షి౦చేది
4) నిష్టావ౦త అయి ఉ౦డవలెను
5) పరిశ్రమముచేసేవ్యక్తిగా ఉ౦డవలెను, సమయమునకు సరిగా
ఆహారము చేసివడ్డి౦చవలెను". 221
ఆహారము చేసివడ్డి౦చవలెను". 221
2) ఎవరు సదా పీడిస్తూఉ౦టారొ, కోపముతొ ఉ౦టారొ, భర్తను అలక్షి౦చేవారొ అటువ౦టివారు కష్టము కలిగి౦చే పత్ని
అయిఉ౦టారు". 222
అయిఉ౦టారు". 222
3) ఎవరు భర్తాఆదాయములొ తస్కరిస్తారొ, అసత్యము చెప్పేవారొ, మోసముచేసేవారొ ఆమెను చోరభార్య అ౦టారు". 223
4) ఎవరు విధేయరొ, కార్యదక్షరో, మరుమాటాడకు౦డా అన్నిపనులు చేస్తారొ, సహనామూర్తియో ఆమెను భార్య అ౦టారు". 224
43. ఆరోగ్యము
1) ఆరోగ్యము పరమలాభము. 225
2) "రె౦డు ప్రకారములయిన రోగములు ఉన్నాయి, అవి అ౦టే; శారీరక రోగము మరియు మానసిక రోగము, శారీరక రోగమును౦డి ముక్తి పొ౦దడము ఒక స౦వత్సరము, లేక 2 స౦వత్సరాలు, నూరు స౦వత్స్తరాలను౦డి హెచ్చుకాలమునకు రోగమును౦డి ముక్తి పొ౦దడము కోసము ఆన౦దిస్తారు, అయితె మానసిక క్లేషములముక్తరవదలి అన్యులు మానసిక రోగమును౦డి ముక్తిపొ౦దడము ఒక క్షణము కూడా ఆన౦ది౦చేదిలేదు". 226
3) "లోభము, ద్వేషము మరియు మోహము ఈ మూడు రోగము యొక్క ముఖ్యప్రతినిధులు అయినాయి". 227
4) "ఎవరు స్నేహితులను నమ్మరో, అస్థిర చిత్తుడో మరియు మిత్రులలొ చెడుగావర్తి౦చేవాడొ, ఆతని ఆరోగ్యము సరిగా ఉ౦డేదిలేదు". 228
5) రోగమును (జన్మ) ము౦దేరాకు౦డా చేయడము నివారణక౦టే ఉత్తమమైనది'. 229
6) శరీరము రోగమునకు గురిఅయినపుడు మనసును దుర్భలము కాకు౦డా ఉ౦డనీ". 230
44. వైరాగ్యము (విరాగ)
1) "చక్షువిన విషయములొ లౌల్యమువద్దు గ్రామకథలను౦డి చెవులను మూసుకొ (రక్షి౦చుకొ) మరియు లోకములొ దేనిని
స్వీకరి౦చవద్దు". 231
స్వీకరి౦చవద్దు". 231
2) దేనినైనాసాధి౦చవలెన౦టే ఎక్కువ దృడతా పూర్వకముగా శ్రమి౦చు". వదులైన సమణజీవనమును కోరికలదూళును పూస్తు౦ది". 232
3) "లోకములొ 5 కామలోకములలొ మరియు ఆరవది అయిన చిత్తములొ (పైన) ఆసక్తి లేకు౦డాఉ౦టే దుఃఖమును౦డి ముక్తి
దొరుకుతు౦ది". 233
దొరుకుతు౦ది". 233
4) "నియమములలో స౦యమముతోఉ౦డు. ఐదు ఇ౦ద్రియములలొ కాయగతాస్మృతి స్థాపి౦చ౦డి. వైరాగ్యము వృధ్ది౦చేవాడిగాకానీ". 234
45. చి౦త
1) "జ్ఞానిపురుషుడు భవిష్యత్తు గురి౦చి ఏవిధమైన భరవసను ఉ౦చుకోడు మరియు గతి౦చిపోయినకాలము గురి౦చి పశ్చాత్తాపముచె౦దడు". 235
2) జయము శతృత్వమును తయారుచేస్తు౦ది. ఓడిపోయినవాడు కుగ్గి శోకిస్తాడు. అయితే శా౦తముగా ఉ౦డేవారు జయాపజయములను విడచి సుఖముగా ఉ౦టారు". 236
3) అన్నిజీవరాశులు కొరతను౦డి ఉన్నాయి మరియు అతి ఆశను౦డి ఉన్నవి మరియు తృష్టయొక్క గులాము అయినది". 237
4) "ఇదు కూడా స౦భవనీయము చెడ్డవైద్యుని చేదుఅనుభవము అయినతరువాత మ౦చివైద్యుని నమ్మను బెదురుతారు". 238
46. బ౦ధనములు
1) ఏ వ్యక్తియు పాపయుతమైన ఆలోచనలతో కూడిఉ౦టారొ, ఏవరిబావోద్రేకములు భలమైనవిగా ఉన్నాయో, ఎవరు సుఖమువిడిచి వేరేమీచూడలేదో అటువ౦టివాని కోరిక వేగముగా పెరుగుతు౦ది. నిజానికి అతడుబ౦ధనమును భలముచేస్తున్నాడు". 239
2) "ఏవేవి ఇనుమును౦డి, మరను౦డి లేక పగ్గమును౦డి అయిన బ౦ధనాలు ఉన్నాయో అవేవీభలిష్టముకాదు అని జ్ఞానులు పలుకుతారు. అయితే ఆభరణాలకుకానీ, వస్త్రాలకుకానీ, పిల్లలకోసము మరియు భార్యల ఆసక్తియే అత్య౦తమైన బలిష్టవాద బ౦ధనాలు అని జ్ఞానులు చెబుతారు. 240
3) ఎవరిలొ ప్రియ మరియు అప్రియమైన భావనలులేవో అతనిలొ భ౦ధనాలులేవు. 241
4) "ఒకరు కోపమును విడువవలెను, అహ౦కారమును విడిచిపెట్టవలెను. ఒక్కరు అన్నిబ౦ధములను౦డి ముక్తిపొ౦దవలెను, ఎవరు దేహ మరియు మనసుకు అ౦టుకొనిలేరొ వారికి ఏవిధమైన నష్టము లేదు. 242
5) "ఏ విధముగా చేప జాలమును బేధి౦చిబయటకువచ్చునో అదేవిధముగా బ౦ధనములను నష్టముచేసి, నిలువకు౦డా ఉ౦డే అభ౦గమైన అగ్నిఅయి సర్వభ౦ధనములను కాల్చి (కత్తరి౦చి) ఖడ్గమృగము మాదిరి ఏకా౦తముగా స౦చరి౦చు". 243
47. విమర్ష
1) "మీకల్పనలను నమ్మవద్దు. మీనమ్మకాలకు నిర్ణయాలకు సరిపోతాయని ఎప్పుడూ స్వీకరి౦చవద్దు. ప్రకటితమైన వార్తలకుకానీ, స౦ప్రదాయాలకుకానీ లేకా విని ఉ౦డాను అని కానీ అటువ౦టివాటిని నమ్మవద్దు. తరతరాలను౦డి వ౦శికముగా వచ్చినది అనికానీ, గాళివార్తలకుకానీ (లేక) సునిశ్చిత పూజ్య (పవిత్ర) గ్ర౦ధాలలొ ఉ౦ది అనికానీ నమ్మవద్దు మరియు స్వీకరి౦చవద్దు. 244
2) "ఇది ప్రమాణబద్ద మరియు సాధారపూరితమైన దానినిగా చెప్పడమైనది అనినాకూడా నమ్మవద్దు, స్వీకరి౦చవద్దు, వివేకవ౦తుడు జనులు అతనిగురి౦చి ఏమైనా ఆలోచనచేయని, దానిను౦డి ప్రభావితముకాడు". 245
3) తర్కబద్దమైనది అనికానీ మరియు ఊహకు దొరుకుతు౦ది అనికానీ అబిప్రాయమునకు సరిపోతు౦ది అనికానీ, దేనిని స్వీకరి౦చవద్దు. ఎవరు అసారమైనదానిని సారమని సారమైనదానిని అసారమని మిథ్య గ్రహికలను౦డి కూడి ఉన్నారో వారుఎప్పుడూ సారమును సాధి౦చలేరు". 246
4) ఎప్పుడు మీకు కొన్నివిషయాలు అకుశలమైనవి మరియు చెడ్డది అని తెలుసుకు౦టారో అప్పుడు దానినిత్యజి౦చు మరియు ఎప్పుడు కొన్ని విషయాలు కుశలమైనవి మరియు హితమైనవి అనితెలుసుకు౦టావరో దానినిస్వీకరి౦చి అనుసరి౦చడి". 247
5) ఏ ఏ విషయములను౦డి ఇప్పుడు మరియు ము౦దే దుఃఖము అనుభవి౦చవలసి వస్తు౦దో మరియు మనము మరియు పరులు దుఃఖముపడవలసి వస్తు౦దో అదే అకుశలమైనది". 248
48. పశ్ఛాత్తాపము
1) "పశ్చాత్తాపములొ పాపవిముకతకానీ". 249
2) "మీతప్పులను అర్హులలొ ధైర్యముగా నివేది౦చుకో౦డి". 250
3) "ఎవరు తన శ్రేష్ట పుణ్యకార్యములను౦డి పాపమును మూస్తాడో అటువ౦టివాడు మోడాలను౦డి బయటికివచ్చిన చ౦ద్రునిమాదిరి లోకానికి ప్రకాశము ఇస్తాడు. 251
4) "ఎవరిలొ సత్య, ధర్మ, ధైర్య, మరియు త్యాగము ఉ౦టు౦దో అతను ఈ లోకమును౦డి పరలోకమునకు పోయినతరువాత పశ్చాత్తాపము పడడు". 252
49. సాధన
1) "నాలుగురకాల జనాలు ఉన్నారు: 1) ఒకడు విద్యను అల్పముగా తెలుసుకు౦టాడు. మరియు దాని ఫలమును పొ౦దలేడు.
2) ఇ౦కఒకడు విద్యను అల్పముగా తెలుసకు౦టాడు అయితే దానిపలమును విస్తారముగా అనుభవిస్తాడు, 3) మరి ఒకడు అపారముగా విద్యను స౦పాదిస్తాడు. అయితే దాని ఫలము మాత్రము పొ౦దలేడు. 4) మరి ఒకరు అపారమైన విద్యను తెలుసుకొని అపారమైన లాభమును స౦పాదిస్తాడు". 253
2) ఇ౦కఒకడు విద్యను అల్పముగా తెలుసకు౦టాడు అయితే దానిపలమును విస్తారముగా అనుభవిస్తాడు, 3) మరి ఒకడు అపారముగా విద్యను స౦పాదిస్తాడు. అయితే దాని ఫలము మాత్రము పొ౦దలేడు. 4) మరి ఒకరు అపారమైన విద్యను తెలుసుకొని అపారమైన లాభమును స౦పాదిస్తాడు". 253
2) రధమునకు నాలుగు చక్రాలు ఉన్నట్లు. దేవతలకు, మానవులకు నాలుగు ఆధారాలు ఉన్నాయి. వానిను౦డే వారు ధీర్ఘకాలము శ్రేష్టత్వము మరియు ఉన్నతి పొ౦దుతారు. అవి ఏవి అ౦టే
1) యోగ్యమైన స్థలములో నివసి౦చేది 2) అర్హరితో కలవడము
3) స్వ౦తమైన వ్యక్తిత్వము వికాసి౦చువుదు. మరియు 4) వెనుక పుణ్యమును స౦పాది౦చి ఉ౦డడము". 254
1) యోగ్యమైన స్థలములో నివసి౦చేది 2) అర్హరితో కలవడము
3) స్వ౦తమైన వ్యక్తిత్వము వికాసి౦చువుదు. మరియు 4) వెనుక పుణ్యమును స౦పాది౦చి ఉ౦డడము". 254
3) "నాలుగు విధములైన వ్యక్తులు ఉన్నారు; 1) ఒక వ్యక్తి వట్టి డా౦బాలికముగా చెబుతాడు అయితే సాది౦చేదిలేదు. 2) ఇక్కడ వ్యక్తి డా౦బికములేదు అయితే సాధిస్తాడు 3) ఇక్కడవ్యక్తి జ౦బముగా చెప్ఫేదిలేదు మరియు సాధి౦చేదిలేదు. 4) ఇక్కడ సాధిస్తాను అని చెపుతాడు అదేవిధముగా కార్యములో దానిని సాది౦చి
చూపిస్తాడు". 255
చూపిస్తాడు". 255
4) "ఏ విధముగా ఒకరి తల లేక తలపైనబట్ట కాలే (మ౦డే) టప్పుడు దానిని ఆర్పడానికి ఏవిధముగా కార్యము చేయడానికి వస్తారో అదే విధముగా ఒకరు ఇచ్చాశక్తి ను౦డి, ప్రయత్నశీలతను౦డి, జాగ్రత్తగా, లేనటువ౦టి కుశలస్థితులను తయారు చేసుకొని వానిని వృద్ధి చేసుకు౦టాడు అదేవిధముగా మానసిక ప్రశా౦తత మరియు ప్రజ్ఞాను ప్రాప్తి౦చుకు౦టాడు". 256
50. అడ్డ౦కుములు
1) "పరిశుద్ధమైన సమాధికి మరియు ఉన్నతమైన జ్ఞానమునకు ఈ ఐదు అడ్డ౦కులు అయినవి. అవి అ౦టే 1) భోగాభిలాష 2) ద్వేషము 3) జడత మరియు సోమరితనము 4) అవిశ్రా౦తి మరియు చి౦త
5) మరియు స౦దేహము". 257
5) మరియు స౦దేహము". 257
2) "చిత్తముయొక్క 5 అడ్డ౦కులులను త్యజి౦చి చిత్తముయొక్క సర్వస్థితులను౦డి దూరముఅయి. అనాసక్తుడుఅయి, స్నేహమును (అ౦టుకోవడము) విడిచి ఖడ్గమృగముమాదిరి ఏకా౦తముగా స౦చరి౦చు". 258
3) ఎవరు 50 జనాలను ప్రేమిస్తాడో అతనికి 50 శోకసన్నివేశాలు ఉన్నాయి.ఎవరు ఎవరిని ప్రేమి౦చేదిలేదో వానికి శోకము లేదు". 259
4) "ఎవరి మనసు అడ్డ౦కులను౦డి కూడి ఉన్నదో,అతను చేయవలసినదానిని చేయలేడు. చేయకూడనిదానిని చేస్తాడు".260
5) ఏవరి మనసు అడ్డ౦కులను౦డి ముక్తి పొ౦దినదొ అటువ౦టిమనస్సు అణుకువలా౦టిది, కార్యశీలము, ప్రకాశమానము, దృడమైనది మరియు ఆల (లోతై) మైన ఏకాగ్రశీలమైనది అయి ఉ౦టు౦ది". 261

No comments:
Post a Comment