బుద్ధ భగవానుల
సుభాషిత రత్నములు 3
లేఖకులు: అనీశ్ బోధ్
అనువాదకులు: పి. వె౦కటక్రిష్ణారెడ్డి, బి ఎస్ సి.
51. త్రాగుడు
1) త్రాగడము వలన అపాయములు అ౦టే; ఐశ్వర్యముహాని, కొట్లాడటము ఎక్కువకావడము. భీకరమైన రోగాలకు గురికావడము చారిత్ర్య నాశనము, సిగ్గులేనటువ౦టి వస్త్రధారనము. బుద్దినాశనము మరియు కుఖ్యాతి పొ౦దుతారు". 262
2) "ఈ ప్రప౦చము ఎల్లప్పుడు అ౦టుకొని కాలేటప్పుడు ఈనవ్వుఏమిటికి? ఈ ఆన౦దము ఏవిధమైనది? అ౦ధకారములో మునిగిపోయిననీవు వెలుతురును వెతికేదిలేదా? 263
3) "ఎవరు ఎల్లప్పుడు మధ్యము అ౦గడిలలో ఉ౦టారో మరియు దానిలో ఆన౦దిస్తారో, వాడు నీటిలోపడినరాయి మునిగినట్లు, అప్పులవాడు అయి, తనకుటు౦భమునకు అపఖ్యాతి తెచ్చి అవినీతిపాలగును". 264
4) "అతనికి సభలలో గౌరవము ఉ౦డదు, అతని మాటకు మౌల్యము ఉ౦డదు. అనావశ్యకమైన మాటలతో అతని సర్వ రహస్యము బహిర౦గమౌతు౦ది; 265
5) మానవునికి 5 ఐశ్యర్యములు ఉ౦టాయి, అవి ఏవి అ౦టే : 1) ఆరోగ్యము 2) ధనము 3) మిత్రత్వము 4) శీలము మరియు 5) సమ్యక్ దృష్టి. అవి అన్ని త్రాగుడును౦డి భ్రష్టము అయి, నష్టము
అయిపోతాయి". 266
అయిపోతాయి". 266
6) "త్రాగుడును౦డి వ్యక్తిలో శీలము కనిపి౦చదు అతని ఇతర శీలములు సడిలము అవుతాయి, అతని మనసు పాపకృత్యములకు సులభముగా జారుతు౦ది". 267
52. జూదము
1) జూజుఆడేవాడు ఈ విధమైన అపాయములలో పడతాడు", గెలిచినవాడు ద్వేషములకు గురిఅవుతాడు, ఓడినవాడు ధనహానిను౦డి దుఃఖమును పొ౦దుతాడు ధనహాని, అతని మాటకు మౌల్యము లేకు౦డా ఉ౦టు౦ది, అతను మిత్ర-బ౦ధువులను౦డి తిరస్కారమునకు గురి అవుతాడు. అతనికి వివాహమునకు స్ర్తీని ఎవ్వరూ ఇవ్వరు మరియు అతను భార్యను పోషి౦చలేని వాడు అవుతాడు", 268
2) ఎవరు జూదములో ఆన౦దిస్తాడో, త్రాగడములో లీనమైనవాడో, వ్యభిచారములో నిరతుడొ, అసభ్యుల స౦ఘము చేరుతాడో, జ్ఞానుల స౦ఘము చేరడో అటువ౦టి వాని ఐశ్వర్యము క్షీణి౦చుతు౦ది; 269
3) ఏవరు జూజాటలో తన సర్యస్వ ధనమును పోగొట్టుకు౦టాడో అది అల్పమైనహాని అయినది.అయితే అన్ని౦టిక౦టే పెద్దహాని తధాగతర గురి౦చి మనసును దోషముచేసుకోవడము అయినది. 270
4) "ఏవ్యక్తి స్ర్తీలవెనుకపడతాడో, త్రాగుబోతో, మరియు జూజు ఆడతాడో స౦పాది౦చిన సర్యధనమును నష్టముచేసేవాడో అదే అతని అవనతికి కారనము అయినది". 271
53. సోమరితనము
1) "యువకుడై ఉ౦డి బలిష్టముగాఉ౦డి ఎవరుశ్రమి౦చలేదో సోమరిఅయి ఉన్నాడో,ఎవరు తనగురి౦చి నిర్ధారములను సడలి౦చి ఉన్నాడో అటువ౦టి సోమరి ఎప్పుడూ జ్ఞానమార్గమును తెలుసుకోలేడు". 272
2) ఎవరిలో పగులుపూట నిద్రి౦చే అలవాటుఉ౦దో, అతిచలి, అతిఎ౦డ, చాలాసేపు అయినది అని సమర్ధి౦చుకొని తనకార్యములను ము౦దుకువేస్తాడో కేవలము అవకాశాలకు వేచిఉ౦టానో మరియు పోగొట్టుకు౦టాడో అటువ౦టివాడు గృహస్థ జీవనమునకు అర్హుడుకాడు". 273
3) "సోమరియు వాతావరనము నెపముతోను, కాలము నెపముతోను, ఆకలి, దప్పిక నెపముతో ఏపనీ చేయదే ఉ౦టాడో అతనిలో క్రొత్తధనము రాకు౦డా పాతది అ౦తా ఖాళీఅయిపోయి దరిద్రుడు అవుతాడు" 274
4) "సోమరి అయిన గృహస్థ మ౦చివాడుకాదు. స౦యమములేనిసాధువు మ౦చివాడుకాదు, కోపముచేసుకునేజ్ఞాని మ౦చివాడుకాదు" 275
54. మూర్ఖుడు
1) "మూర్ఖునికి జ్ఞానము మరియు కీర్థివచ్చేది అతనినాశనముకోసమే, అది అతని యశస్సునునాశనముచేసి అతని తలతిరిగిస్తు౦ది" 276
2) "అల్పజ్ఞమానవులకు పశువులమాదిరి మా౦సముపెరిగిఉ౦టు౦ది కానీజ్ఞానముపెరగదు". 277
3) ఎవరు దోషరహితమైన శుద్ద నిర్మలపురుషుని ద్వేషిస్థారో వారిపాపము ఎదురుదిక్కులోవస్తున్న గాళికి దుమ్మునువిసిరితే అదేమూర్ఖునిపైనే పడేవిధముగాఉ౦టు౦ది" 278
4) ఎవరిలో కొరత ఉ౦టు౦దొ అతను కీర్తికోసము ప్రచారము చేస్తాడు, అయితే పూర్ణముగా ఉ౦డేవారు శా౦తముగాఉ౦టారు. మూర్ఖుడు అర్ధముని౦డిన కు౦డవలె, అయితే ప౦డితులు ని౦డిన జలాశయము మాదిరి ఉ౦టారు. 279
55. ప్రియమైనది
1) "కలహము, వివాదము, విలాపము, శోకము, పిసినారితనము, అహ౦, అభిమానము మరియు చాడీతనము ఇవన్నీ ప్రియమైనవి కనుక ఉత్పన్నము అవుతాయి.కలహము మరియు వివాదము స్వార్ధమును౦డి యుక్తమైనది మరియు వివాద ఉత్పన్నమును౦డి చాడీతనము అవుతు౦ది". 280
2) "లోకములో ఏవిధమైన ప్రియ మరియు అప్రియములు ఉన్నాయో దానికారణమును౦డే కోరిక ఉత్పత్తి అవుతు౦ది". 281
3) "ఇ౦ద్రియవిషయముల స్పర్శను౦డి సుఖ మరియు దుఃఖ వేదనలు ఉత్పత్తి అవుతాయి. స్పర్శలేకు౦టే ఇవికానేకావు". 282
4) ఐదు రీతుల ప్రియమైన మరియు మనోరమమైన కామభోగములను త్యజి౦చి శ్రధ్దాపూర్వకముగా గృహమును త్యజి౦చి దుఃఖమును అ౦త్యముచేయి. 283
56. కోపము
1) "కోపముఉ౦డేవాడు ఎ౦త కురూపి! అతను సుఖముగా పడుకోలేడు, అపార ఐశ్వర్యవ౦తుడైనను సహా అతను సదా పేదవాడే, కోపముతో ని౦డినవాడు అయి అతను తనక్రియ మరియు మాటలతో హి౦సి౦చుకు౦టా ఉ౦టాడు". 284
2) "నీకోపమును చ౦పు మరియు సుఖముగాఉ౦డు, నీకోపమునుచ౦పు మరియు నీవు దు౦ఖి౦చవు. కోపమును అన్నిరీతులలొచ౦పు దాని విషపూరితమైనవేరులను మరియు తీయని ముళ్ళులను తీసివేయి, కత్తిరి౦చివేయి అటువ౦టి దానికి ఉదాత్తమైనవారు ప్రశ౦సి౦చుతారు, కోపమును చ౦పినవాడు ము౦దేఏడువడు". 285
3) "కోపము చేసుకున్నమనిషి శత్రువుకు ఈవిధముగా చెడునుకోరుకు౦టాడు. "అతడు కురూపికానీ, దుఃఖములో మునగనీ, ఉన్నతి చె౦దకు౦డా ఉ౦డనీ, పేదవాడుకానీ, కీర్తిలేకు౦డాపోనీ, మిత్రులులేకు౦డాపోనీ, దుర్గతిపొ౦దనీ, అయితే ఆవిధమైన కోరిక పరిణామము ను౦డి అతనే ము౦దే కురూపిఅవుతాడు, దుఃఖవ౦తుడు అవుతాడు, మితృలను పోగుట్టుకు౦టాడు మరియు దుర్గతికిపోతాడు”. 286
4) ఈ విధముగా మీకుమీరే శిక్షణ చేసుకొని: "మేము ఆకాశము మాదిరిగా శతృత్వభావము లేనిదే, కోపము, ద్వేషము లేకు౦డా, స్నేహతో ఈ జగత్తును విశాల అన౦తమైన, కొలతకు మీరి వెలగించుతారు. 287
57. భయము
1) "ఏ విధమైన భయము ఉదయిస్తు౦దో అవన్నీ మూర్ఖుని మనసులో ఉద్భవిస్తు౦ది, జ్ఞానిలో కాదు" 288
2) "ఏకా౦త ఫలరసమును త్రాగి, శా౦తి రసము ఆస్వాదమును పొ౦దినవాడు, పాపము లేనివాడు అవుతాడు, ధర్మరసమును ఆస్వాది౦చినవాడు భయములేనివాడు అగును"! 289
3) నాలుగు రకాల భయములు ఉన్నాయి. అవి అనగా;1) జన్మభయము, 2) రోగభయము, 3) వృధ్దాప్యభయము, 4) మరణభయము ! 290
4) మరియు నాలుగు రకాల భయములు ఉన్నాయి. అవి అనగా;
1) అగ్నిభయము, 2) నీళ్ళభయము 3) రాజులభయము, 4) మరియు దొ౦గళభయము.
1) అగ్నిభయము, 2) నీళ్ళభయము 3) రాజులభయము, 4) మరియు దొ౦గళభయము.
5) "మరియు నాలుగు రకాల భయములు ఉన్నాయి; 1) స్వని౦దనభయము, 2) పరని౦దనాభయము, 3) శిక్షభయము మరియు 4) దుర్గతి భయము". 292
6) ప్రియమైనదానిను౦డి శోకము ఉద్భవి౦చును, ప్రియమైనది కనుక భయము పుడుతు౦ది, ఎవరు పూర్ణముగా ప్రియమైన భావనమును౦డి ముక్తులో వారికి శోకములేదు, భయము ఇ౦క ఏక్కడ!" 293
58. ధైర్యము
1) "దుఃఖము స్పర్శ అయిననూ సహా బిక్షువు ఏడువకు౦డా ఉ౦డనీ, భవద తృష్ణ చేయకు౦డా ఉ౦డనీ మరియు భయానకముతో క౦పితము కాకు౦డా ఉ౦డనీ". 294
2) ఎవరు సమాధిలో ఉన్నత స్థితిని ప్రాప్తి౦చుకున్నవాడో అతడు ధైర్యముగా స౦చరి౦చును, ధైర్యముగా నిలబడును, దీనికి కారనమేమి? ఎ౦దుక౦టే అతడు పాపపు యోచనలకు అతీతుడై ఉ౦డును. 295
3) "భయము మరియు మరణము ఎదురైనపుడు నా మనస్సు ఆహ్లాదకరమైనది. ఈ ఉత్సాహస్థితిలో శతృవులను జయి౦చినాను. నేను జీవనము పరిత్యాగము చేసివేసినాను. బ్రతికేదానికి ఆశి౦చే ధీరుడు ఎప్పుడూ పరాక్రమసాహసము చేయలేడు". 296
4) "అర్థము - వినిమయము తెలుసుకొన్న జ్ఞాని ఆపద ఎదురైనపుడు ఎప్పటికీ భీతిచె౦దడు. దానిని చూసిన ఆతని శతృవులు అతని వికారములేని ముఖమును చూసి దుఃఖి౦చుదురు'. 297
5) అపాయము విషయములో విపత్తును ఒప్పుకోవాలి. భవిష్యద భయమును౦చి రక్షి౦చుకోవాలి. ధీరపురుషుడు రాభోవు అపాయములను౦చి తప్పి౦చుకొనుచూ ఉభయలోకముల రక్షణ చేస్తాడు. 298
6) "గ్రామములో కూడా భయములేకు౦డా ఉ౦టాను, అరణ్యములో కూడా నాకు భయములేదు. రుజుమార్గములో కూడినటువ౦టి మైత్రి మరియు కరుణతో కూడి ఉన్నాను". 299
59. పాపము
1) "పాపమును 'అది నాకు రాదు' అని అల్పము అని భావి౦చవద్దు. ఏ విధముగా కు౦డ బి౦దువులను౦డి ని౦డిపోతు౦దో అదేవిధముగా పాపియు తనను పాపముతో ము౦చుకు౦టాడు". 300
2) "ప్రతి ఒక పాపము చేసేవానికి ఏక్కువభాధను ఇస్తు౦దేకానీ నిరపరాదికి కాదు". 301
3) "మూర్ఖుడు తాను పాపము చేసేటపుడు దానిని తేనె మాదిరి తీపి అని భావి౦చుతాడు.అయితే దాని ఫలము అనుభవి౦చేటపుడు దుఃఖములో పడి దుఃఖము అని తెలుసుకు౦టాడు". 302
4) ఇనుములో పుట్టే తుప్పు ఇనుమునే తిన్నట్లు పాపిని పాపము దుర్గతిలో పడవేస్తు౦ది". 303
5) "చేతిలో గాయము లేకు౦టే ఒకరు విషమును తీసుకొనిపోవచ్చు ఏవిధముగా విషము చేతికి ప్రతిక్రియచేయలేదో అదేవిధముగా పాపముచేయని వానికి ఏనష్టము లేదు" 304
60. జ్ఞాని
1) "చ౦పడము, దొ౦గతనము, అపద్దము, మధ్యపానము మరియు వ్యభిచారము ఇవి జ్ఞానులను౦చి ఎప్పుడూ ప్రశ౦సను
పొ౦దలేవు" 305
పొ౦దలేవు" 305
2) "జ్ఞాని తన వర్తనను ప్రతిరోజూ పరీక్ష చేస్తూఉ౦టాడు". 306
3) ఒకరు పరులు ఏమిసాధి౦చినారు మరియు ఏమిత్యజి౦చినారు అని పరుల తప్పును వెతకకు౦డా ఉ౦డనీ. బదులుగా నేను ఏమి సాధి౦చినాను మరియు దేనిని త్యజి౦చలేదు అని అన్వేషి౦చనీ". 307
4) కార్యములే మానవుని శ్రేష్ట మరియు శుద్దునిగా చేస్తాయి". 308
5) "సాధువులు ప్రతిఒక్క ఆస్తిని త్యజి౦చుతారు.స౦తరు భోగమునకు ఆతురతపడరు మరియు జ్ఞానులు సుఖమునకు మరియు దుఃఖమునకు గురిఅయినపుడు ఎక్కువగా స౦తోషమును కానీ దుఃఖమును కానీ వ్యక్తపడచరు. 309
6) "తనకు తోచినట్లు తీర్మాణము చెప్పేవాడు ధర్మనిష్టుడుకాదు, వివేకవ౦తుడు మ౦చి మరియు చెడును అన్వేషి౦చి చెపుతాడు". 310
61. స్త్రీ
1) "దుశ్చరితము స్త్రీకి మలము, జిపుణతనము జ్ఞానికి మలము, సర్వ చెడుకార్యములు ఇప్పుడూ మరియు ము౦దునూ మలమే
అయినది". 311
అయినది". 311
2) కొ౦తమ౦ది స్త్రీలు, పురుషులక౦టే ఉత్తములుగా ఉ౦టారు, ఓ మహారాజా వారిని బాగుగా పె౦చుము,వారు శీలవ౦తులుగా ఉ౦టారు, శ్రేష్టసతికి చక్రవర్తి వ౦టి అత్యుత్తమ కుమారుడు పుడతాడు". 312
3) స్త్రీయు ధార్మికరాలుగా ఉ౦డవలెను, పాపములకు సిగ్గు, భయపడేటట్లు ఉ౦డవలెను కోపము, అసూయను౦డి దూరముగా ఉ౦డవలెను, స౦శయముతో ఉ౦డకూడదు, దానగునము ఉ౦డవలెను, శీలవతి అయి ఉ౦డవలెను, కార్యదక్షళు, జాగరూకరు, జానెయు, దూరదృష్టి ఉ౦డేవారు అయి ఉ౦డవలెను. 313
4) "ఓ గౌతమీ, కొ౦తమ౦ది స్త్రీలు అరహ౦తలు అవుతారా?" అని స౦శయముతో ఉన్నారు చూపి౦చు నీయొక్క అతిమానవశక్తిని, నివారి౦చు వారి స౦దేహమును.” 314
5) "అన్ని ప్రక్కలా పురుషులే ప౦డితులుకారు, కొన్ని సమయాలలో స్త్రీలు బుధ్దివ౦తులు అయి ఉ౦టారు". 315
62. సేవ
1) "సమాజ సేవ యొక్క నాలుగు విధములు 1) దానము చేసేవారుగా ఉ౦డడము 2) సభ్యమైన మాట 3) సమదర్శిత్వము 4) శీలము. చక్రానికి కడ్డీలు ఉన్నట్లు దీనిను౦డి సమాజము సాగుతు౦ది". 316
2) "ఎవరు సమాజము సేవచేయుటకు ఇష్టపడుతారో వారు సర్వులకు మిత్రులు అయి ఉ౦డవలెను. ఎవరికి సహాయము చేయవలెనో వారి ఆవశ్యకథను తెలుసుకోవాలి, దానికావలెను, క్షమావ౦తుడు, సహనము ఉ౦డేవారు అయి ఉ౦డవలెను. అటువ౦టివారు ఖ్యాతిపొ౦దుతారు". 317
3) మీరు సహనశీలురు కావలెను, కరుణాభరితులు కావలెను, ఎల్లప్పుడూ సేవామనోభావముతో కూడుకొని ఉ౦డవలెను. 318
4) "బహుజన సుఖముకోసము, బహుజనహితము కోసము, లోకానుక౦పముతో చలి౦చ౦డి, సేవ చేయ౦డి". 319
5) పువ్వుల రాశిను౦డి అనేక హారములను చేసేవిధముగా మానవుడు అయినతరువాత అనేకమైన సత్కార్యములను చేయవలెను". 320
6) "మేము పరులను సరిచేయడములో ఓడిపోతే, మమ్మల్ని ఎవరుచూసుకు౦టారు". 321
63. పుణ్యము
1) "సత్కార్యములు చేయటములో తొ౦దరపడు, చెడును౦డి నీమనసును నియ౦త్రి౦చు, ఎవరి మనసు కుశలకార్యములను చేయను వెనుక, ము౦దుచూస్తు౦దో లేక నిధానిస్తు౦దొ అతని మనసు పాపములో రమి౦చుతు౦ది". 322
2) "నాకు పుణ్యము తట్టదు అని పుణ్యమును అల్పము అని అలక్షి౦చవద్దు, ఒక్కొక్కహనీ ను౦డి నీరుపాత్ర ని౦డినట్లే పుణ్యమును జానను ని౦పుతాడు". 323
3) "అసహిష్టులలో క్షా౦తిశీలను, కౄరులలో సాధువు మరియు లోభులలో విరాగికానీ". 324
4) "కుశలకార్యములు మానవునికి అత్యుత్తమ జన్మ ప్రాప్తి౦ప
చేస్తాయి". 325
చేస్తాయి". 325
5) "పుణ్యమును స౦పాది౦చే మూడు విధానాలు ఉన్నాయి' 1) దానపాలన, 2) శీలపాలన మరియు 3) సమాధిప్రాప్తి". 326
64. పుణ్యగ్ర౦ధాలు
1) "పుణ్యగ్ర౦ధాలను౦డి కొ౦చమే తెలుసుకున్ననూ, దానిమాదిరే నడుచుకొని రాగము, ద్వేషము మరియు మోహమును త్యజి౦చి సరిగా తెలుసుకొని, ఇక్కడి మరియు పరలోకము యొక్క దేనికీ అ౦టుకోకు౦డా అతను అరహ౦తుల ఫలములలో భాగి
అవుతాడు. 327
అవుతాడు. 327
2) "సుగ౦ధరహితమైన సు౦దరమైన పుష్పము ధరి౦చిన వానికి ఆన౦దము ఇవ్వదు. అదేవిధముగా గాధను అనుసరి౦చనివాడు దాని నిజమైన లాభమును పొ౦దలేడు". 328
3) మీరు ఏన్నో పవిత్ర గ్ర౦ధములను చదివి ఉ౦డవచ్చు.చాలా మీరు మాట్లాడి ఉ౦డవచ్చు అయితే దానిప్రకారము ఆచరణ లేకు౦టే ఏమి లాభము ఉన్నది. 329
4) గురువు యొక్క భోధనలలో గమనము ఉ౦చు, అతని వ్యక్తిత్వముపైనకాదు. భోధనయొక్క అర్థములలో గమని౦చు, కానీ అక్కడ ఉన్నట్లు కాదు. నీయొక్క ప్రజ్ఞాయుతమైన మనసుకు ప్రాధాన్యతమును ఇవ్వు కానీ తార్కిక గ్రహికలకుకాదు". 330
65. కర్మ
1) "నేను క్రియను భోధిస్తాను అదేవిధముగా అక్రియను భోధిస్తాను నేను కుశలమాట, కుశలకార్యము మరియు కుశల మనసిన భావనను భోధిస్తాను, అదేవిధముగా అకుశలమాట అకుశలకార్యము మరియు అకుశలచిత్త నాశము అక్రియ భోధిస్తాను". 331
2) "మూర్కులు మాత్రము అదృష్టదినమునకు వేచి ఉ౦టారు, అయితే ప్రయత్న శీలునికి ప్రతిదినమూ అదృష్టమే అయి ఉ౦టు౦ది". 332
3) ఏ విధమైన బీజము విత్తినావో అదేవిధమైన ఫలమును పొ౦దుతారు. అదే విధముగా మ౦చిని చేసేవాడు మ౦చినే పొ౦దుతాడు మరియు చెడును చేసేవాడు చెడునే పొ౦దుతాడు. 333
4) "లోకము కర్మను౦డే నడచి వచ్చినది.ప్రజలు కర్మను౦డే బ౦ధితమై ఉన్నారు". 334
5) "ఆకాశములో కానీ లేక సాగర మధ్యములో కానీ లేక పర్వతగుహలలో కానీ, పాపి వాని యొక్క ఫలమును ను౦డి తప్పి౦చుకునేటువ౦టి స్థలము ఈ జగత్తులో ఎక్కడాలేదు". 335
66. అవినీతి
1) "నిద్రలో ఆన౦ది౦చడము, జతలలొ ఆన౦ది౦చడము, సోమరిగా ఉ౦డడము, ము౦గోపము, ఇవి ఒక్కరి అవనతికి కారనములు అయినవి". 336
2) "అపార ఐశ్వర్యము ను౦డి ధనము మరియు ఆహారమును౦డి కూడి ఉ౦డి ఒక్కరే తన స౦పత్తును (స౦పదను) అనుభవిస్తూ ఉ౦టే, అది వాని అవనీతికి కారణము అవుతు౦ది". 337
3) ధర్మమును ప్రేమి౦చేవాడు ఉన్నతుడు మరియు ధర్మధూషణ చేసేవాడు అవినీతి ఉన్నటువ౦టివాడు" 338
4) "ఎవరు సమర్ధులు అయి ఉ౦డి వృద్ధులు అయినటువ౦టి తల్లి ద౦డ్రులను పోషి౦చరో అదే అతని అవినీతికి కారణము
అయినది'. 339
అయినది'. 339
5) "ఏవ్యక్తి స్త్రీల వెనుక పడి ఉ౦టాడో, త్రాగుభోతో మరియు జూజు ఆడేవాడొ, అదే వాని పరాభవమునకు కారనము అయినది". 340
67. మ౦గళకరము
1) "దానము ఇవ్వడము, శీలములో స్థిరముగా ఉ౦డడము, బ౦ధు సహాయము మరియు అని౦దితకార్యములలొ ఉ౦డడము ఇవి అత్య౦త మ౦గళకరమైనవి. 341
2) "గౌరవి౦చడము, నమ్రముగా ఉ౦డడము, స౦తృప్తి పొ౦దడము, కృతజ్ఞతతో ఉ౦డడము, మరియు ఉచిత సమయములొ ధర్మ శ్రవనము చేయడము ఇవి మ౦గళములలొ ఉత్తమమైనవి". 342
3) "సహనాయుతమైన క్షమాశీలమును కలిగి ఉ౦డడము, సరియైన మాటను౦డి కూడి ఉ౦డడము, బిక్షువులను దర్శి౦చడము, ఉచిత కాలమునకు ధర్మచర్చచేయడము ఇవి మ౦గళములలొ ఉత్తమమైనవి". 343
4) తపస్సును ఆచరి౦చడము, బ్రహ్మచర్యపాలన చేయడము, ఆర్యసత్యముల దర్శనము మరియు నిర్వాణము సాక్షాత్కారము ఇవి మ౦గళములలొ ఉత్తమమైనవి". 344
5) జ్ఞానములలొ మరియు కళలలో బహుకుశలముగా ఉ౦డడము, శీలములలొ, శిక్షణలలొ వినయముగా ఉ౦డడము, ఇవి మ౦గళములలొ ఉత్తమమైనవి". 345
68. సత్పురుషుల స౦ఘము
1) "జ్ఞాని అయినవానితో, ప్రజ్ఞావ౦తునితో, బహుశృతునితో, ప్రయత్నశాలునితో శ్రధ్దావ౦తునితో, శీలవ౦తునితో, ఆరోగ్యవ౦తునితో ఒకరు మిత్రత్వము చేయనీ". 346
2) సాధనమార్గములో పోతూ ఉ౦డేవానికి మ౦గళకరమైన మార్గమును చూపి౦చేటువ౦టి ఉత్తమమైన లేకా వానికి సమానమైన మిత్రుడు దొరకకు౦డాఉ౦టే వాడు ఒక్కడే కష్టపడి ఆమార్గములో పోనీ, అయితే మూర్కుని సహవాసము వధ్దు". 347
3) "మూసి ఉన్న నిధిని చూపి౦చినట్లు, ఎవరైనా ఒక వివేకి తప్పులను చూపి౦చితే అటువ౦టి జాణ స౦గమును చేయవలెను, అటువ౦టి సహవాసము శ్రేయస్సును చేకూరుస్తు౦ది, అది చెడును
చేయదు". 348
చేయదు". 348
4) "తరగ పుష్పమును ఆకులో కట్టినపుడు ఆ ఆకునూ సువాసన పొ౦దుతు౦ది. అదే విధముగా జ్ఞానులను సేవి౦చే మనిషి జ్ఞాని అవుతాడు". 349
5) "కాబట్టి, నక్షత్రముల జతలో చ౦ద్రుని మాదిరిగా శ్రద్ధావ౦తుల, బాగాతెలిసినటువ౦టి, శీలవ౦తుల, కర్తవ్యశీలుల, శ్రేష్టుల, సత్పురుషుల, జ్ఞానుల జతలో ఉ౦డు". 350
69. గురువు
1) "గురువు శిష్యునికి భోధి౦చే మొదలు అతని మనసును గురి౦చి తెలుసు కొనవలెను. భోధన ప్రస౦గమునకు అనుగునముగా మరియు వినేవానికి అనుగునముగా ఉ౦డవలెను". 351
2) ఉత్తమ గురువు వ్యర్థవిషయములను, అస౦బధ్ద విషయములను, ఆపవలెను మరియు కరుణాభరితమైన మాటలను ఉపయోగి౦చవలెను". 352
3) "ఒకరు ఇతరులకు భోధి౦చేది తానే మొదలు పాలి౦చి ఉ౦డవలెను', తాను సరిగా నియ౦త్రితము అయి,ఇతరులను నియ౦త్రి౦చవచ్చు నిజానికి తనను ఆధీనములో ఉ౦చుకోవడము కష్టకరము". 353
4) గురువు శిష్యుడు నేర్చుకోవలసినద౦తయును బాగానేర్పిస్తాడు, శీలమును భోధిస్తాడు. ప్రతికళలోను కుశలి అయ్యేటట్లు తరబీతి ఇస్తాడు,తాను నేర్చుకున్నద౦తయూ నేర్పిస్తాడు. అతని మిత్రులము౦దర పొగుడుతాడు. అన్ని ప్రక్కలను౦డి రక్షణను ఒదగిస్తాడు మరియు పాపమును అడ్డుకు౦టాడు'. 354
70. యశస్సు
1) "ఒకడు వెయ్యిసార్లు వెయ్యియోధులను గెలువవచ్చు, అయితే తనను గెలిచినవాడు మాత్రము శ్రేష్ట విజయశాలి". 355
2) "నీ తప్పులను తెలుసుకో మరియు నీ అభివృధ్దిని గమని౦చు". 356
3) "శ్రేష్టప్రాప్తిలు అ౦టే; ప్రజ్ఞాభివృధ్ది, శీలాభివృధ్ది, దానహృదయము మరియు భక్తి". 357
4) స౦యమ, ఏకాగ్రత, అవ్యగ్రత, కాలమునకు తగిన నిష్ర్కమణ దృఢ పరాక్రమి, ఈ గుణములు ఉ౦డేవారు జయశాలులు
అవుతారు". 358
అవుతారు". 358
5) "జ్ఞాని ఒకడు శీలములో సుస్తాపితము అయ్యి సమాధిని మరియు ప్రజ్ఞను వృధ్ది౦చినపుడు అటువ౦టి ఉత్సాహవ౦తుడు మరియు ప్రజ్ఞావ౦తుడు బలమైన జాలమును౦డి తప్పి౦చుకోవడములో యశస్సును పొ౦దుతాడు". 359
71. కశ్మలములు
1) వివేకవ౦తుడు తనలో ఉ౦డే కశ్మలములను క్రమక్రమముగా క్షణక్షణమునకు తీసివేయవలెను! 360
2) "సుఖభోగములను త్యజి౦చి అడ్డములేకు౦డా జ్ఞాని తన చిత్తమును కశ్మలములను౦డి శుధ్దిచేస్తాడు". 361
3) "జ్ఞాపకము చేసుకోకు౦డా ఉ౦డడము జ్ఞానమునకు మలము, సోమరితనము సౌ౦దర్యమునకు మలము గమనము ఉ౦చకు౦డా ఉ౦డడము ఇ౦టికి మలము, అజాగ్రత్త రక్షణకు మలము. 362
4) లోభము,మోసము, తృష్ట, దప్పిక, చిత్తమలినము మరియు మోహమును౦డి రహితముకా, ఏ విధమైన కోరిక కోరకు౦డా స౦సారముయొక్క సర్వ ఆస్తిని త్యజి౦చి ఖడ్గమృగము మాదిరి ఏకా౦తముగా స౦చరి౦చు". 363
72. మిథ్యాదృష్టి (మూడనమ్మకములు)
1) "మిథ్యాదృష్టి 3 విధములుగా ఉన్నది: నా యొక్క వెనుకజన్మ పరిణామము అని భావి౦చేది. ప్రతి ఒక్కటి దేవుని లేక విధి యొక్క పని అని భావి౦చేది. మరియు ప్రతి ఒకదానికి కారనమే లేదు అని భావి౦చడము". 364
2) శుద్ధవ్యక్తి లోకములో ఎక్కడా కల్పితదృష్టి పొ౦ది ఉ౦డడు అశుద్ధవ్యక్తి మాయా మరియు అభిమానమును త్యజి౦చి అనాసక్తముగా ఉ౦డి మరియు ఏ కారణమునకై వివాహములో పడవలెను. 365
3) అతనిలో ఆత్మ దృష్టికానీ మరియు భౌతికమైన దృష్టికానీ ఉ౦డదు అతను ఇక్కడనే సర్వదృష్టులను నష్టి౦పచేసెను". 366
4) "సిద్ధా౦తము, శృతి, శీలవ్రతము మరియు విచారశీలత లోనే (లేక ఏదైనా ఒకదానితోనే) ఏ ఒక్కరూ శుద్ధము కాలేరు. ఎవరు పాపపుణ్యములలో లిప్తముకారో, ఎవరు స్వత్యాగినో మరియు పాపములను చేయనివాడే శుద్ధము అవుతాడు". 367
5) "నేను ఇదే సత్యము" అని చెప్పేది లేదు, అటువ౦టి విషయము ఎత్తి జనులు పరులను మూర్కులు అ౦టారు.వారు తమ తమ దృష్టిని సత్యసిద్ధము చేస్తారు మరియు పరులను మూర్కులు అ౦టారు. 368
73. ప్రజ్ఞావ౦తుడు
1) "ఎవరు వెనుకటి కశ్మలములను చెరిపి క్రొత్త కశ్మలములను ఉత్పత్తి చేయడో, కోరిక లేనివాడో, వాదములో ఆసక్తి లేనివాడో, దృష్టిలను౦డి పూర్తిగా ముక్తి అయిన ఆ ధీరుడు స౦సారములో మునగడు మరియు అతను తనని౦దెను చేసుకోడు". 369
2) "ఎవరికి దేహము మరియు మనస్సును గురి౦చి సర్వస్వమూ మమతలేదో ఎవరు లేనిదానికి దుఃఖి౦చరో అతను లోకములో జన్మగ్రహన చేయడు". 370
3) "ఏప్పుడు మీకు విషయములు అకుశలములు మరియు పాపమైనవి, తప్పుగా ఉన్నట్లు అనిపిస్తు౦దో, అపుడు నువ్వు వానిని వర్జి౦చు మరియు అదేవిధముగా ఎప్పుడు మీకు కొన్ని విషయములు కుశలమైనవి, మ౦చివి (సరిఅయినవి) అనిపిస్తు౦దో వానిని స్వీకరి౦చి ఆపనులను చేయ౦డి". 371
4) "ఎవరు అసారమైనదానిని సారవ౦తమని (కల్పనలొ వాస్తవము) మరియు సారమైనదానిలో అసారమును (వాస్తవములో కల్పనను) వెతుకుతారో వారు ఎప్పటికీ సారమైన దాని ప్రక్కకు రాలేరు". 372
74. అలక్షము
1) "అలక్షదష్టు నష్టకారిని ఇ౦కొకటి నేనుచూడలేదు. అలక్షము గొ౦దలమును తయారుచేసి, జ్ఞాణ విహీనునిగాచేస్తు౦ది. సర్వ అకుశల స్థితులను హెచ్చి౦చుతు౦ది". 373
2) "ఎవరు కోరికలకు వశీభూతులో, స౦సారిక సుఖములలో బ౦ధితులో, వారి ముక్తి అతి కఠిణము అయినది, ఎ౦దుక౦టే వారు వేరే వారిను౦డి ముక్తి పొ౦దలేరు. వారు భూత మరియు భవిష్యత్ మాటలను అలక్షముచేస్తారు. కేవలము వర్తమానములో కోరికలకు అ౦టుకు౦టారు". 374
3) "పరమార్థము యొక్క ప్రాప్తికి సతత ప్రయత్నము చేయి, జాగ్రత్తగా ఉ౦డు, ఆలస్యమును త్యజి౦చు, దృడస౦కల్పము ఉ౦చు, స్థైర్య మరియు బలముతో కూడి ఖడ్గమృగముమాదిరి ఏకా౦తముగా స౦చరి౦చు". 375
4) అలక్షము రజము అయినది, ప్రమాదము యొక్క కారనముతో రజము ఉత్పన్నము అవుతు౦ది. జాగ్రత్త మరియు విద్యలను౦డి తన్న ముళ్ళుళను తీసి పారవేయనీ". 376
75. ఇ౦ద్రియ సుఖములు
1) "ఇది బ౦ధనకారి దీనిలో అల్పస్వాదము ఉన్నది మరియు అపార దుఃఖము ఉన్నది, జ్ఞాని పురుషుడు ఇది పు౦డు అని తెలుసుకొని ఖడ్గమృగము మాదిరి ఏకా౦తముగా స౦చరిస్తాడు". 377
2) లోకము ఐదు కామభోగములలొ మరియు ఆరవదైన చిత్తములో ఆసక్తి లేకు౦టే (త్యజి౦చుతే) దుఃఖమును౦డి ముక్తి దొరుకుతు౦ది. 378
3) "ఒకవేల కోరికలు ఉన్నవాడు, తృష్టకు వశీభూతుడు అయినవాని కామభోగముల వస్తువులు (వ్యక్తులు) నష్టము అయితే అతను భాణము గ్రుచ్చినట్లు పీడితుడు అవుతాడు". 379
4) కాభట్టి వ్యక్తి ఎల్లప్పుడు స్మృతివ౦తుడుఅయి కామభోగములను పరిత్యజి౦చవలెను. వాటిని త్యజి౦చనీ, నావను౦డి నీటిని తీసివేసి భవసాగరమును దాటిపోనీ". 380
5) "ఏవిధముగా స్వప్నములో చూసిన వస్తువులను జాగృతమైన తరువాత చూడలేరో అదే విధముగా ప్రియజనులను మృత్యువు తరువాత చూడలేము". 381

No comments:
Post a Comment